Mahesh Babu New Look With Beard for His Upcoming Movie | లీకైన మహేష్‌ కొత్త లుక్‌ - Sakshi
Sakshi News home page

Jun 6 2018 10:44 AM | Updated on May 28 2019 10:04 AM

Mahesh Babu Beard Look Revealed - Sakshi

భరత్‌ అనే నేను రిలీజ్‌ తరువాత ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్న సూపర్‌ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. కొత్త సినిమాలో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించేందుకు మేకోవర్ అవుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చేయనున్నారు మహేష్. ఈ సినిమాలో మహేష్ గడ‍్డంతో కనిపించనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ మహేష్ గడ్డంతో దర్శనమిచ్చాడు.

ఇప్పటికే మహేష్‌ లుక్‌ పై నమ్రత సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చేశారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన మహేష్ సరికొత్త లుక్‌లో ఆకట్టుకున్నాడు. గతం ఎన్నడూ లుక్‌ విషయంలో ప్రయోగాలు చేయని మహేష్ తొలిసారిగా డిఫరెంట్‌ లుక్‌ లో కనిపిస్తుండటంతో వంశీ పైడిపల్లి సినిమాపై భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. మహేష్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని అశ్వనీదత్‌, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement