ఆర్టీఏ కార్యాలయంలో మహేష్‌ బాబు | Mahesh Babu at Kharatabad RTA Office | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ కార్యాలయంలో మహేష్‌ బాబు సందడి

Sep 16 2017 1:57 AM | Updated on Sep 19 2017 4:36 PM

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు శుక్రవారం ఖైరతాబాదులోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.

సాక్షి, హైదరాబాద్‌ : సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు శుక్రవారం ఖైరతాబాదులోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఆయన తన కారు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు  స్వయంగా వాహనాన్ని డ్రైవ్‌ చేసుకుని వచ్చారు. అనంతరం మహేష్‌ బాబు వేలిముద్ర పెట్టి వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. కాగా ప్రిన్స్‌ ఆర్టీఏ కార్యాలయానికి రావడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. మరోవైపు మహేష్‌ బాబు ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చాడని తెలుసుకొని పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఇక ఆర్టీఏ ఉద్యోగులు కూడా మహేష్‌తో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement