సంకెళ్లు తెంచుకున్న మహేంద్ర బాహుబలి | mahendra baahubali comes with ferocious look | Sakshi
Sakshi News home page

సంకెళ్లు తెంచుకున్న మహేంద్ర బాహుబలి

Oct 22 2016 5:36 PM | Updated on Sep 4 2017 6:00 PM

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి మొదటి భాగం షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ సినిమా మీద బోలెడంత హైప్ క్రియేట్ అయ్యింది.


హైదరాబాద్ : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి మొదటి భాగం షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ సినిమా మీద బోలెడంత హైప్ క్రియేట్ అయ్యింది. అనుకున్నదాని కంటే కూడా భారీ స్థాయిల్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. అప్పటినుంచి నాన్ బాహుబలి రికార్డులు అనే మాట కూడా కొత్తగా మొదలైంది. ఇప్పుడు బాహుబలి-2 ద కన్‌క్లూజన్ సినిమా మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, మహేంద్ర బాహుబలి ఎలా ఉంటాడు, ఏం చేస్తాడన్న ప్రశ్నలు సామాన్య ప్రేక్షకుల నుంచి సినిమా విశ్లేషకుల వరకు అందరికీ వస్తున్నాయి. 
 
షూటింగ్ దాదాపుగా పూర్తికావచ్చిన తరుణంలో ప్రభాస్ పుట్టినరోజు బహుమతిగా బాహుబలి 2 ఫస్ట్‌లుక్‌ను గ్రాండ్‌గా ఏర్పాటుచేసిన ఒక ఈవెంట్‌లో విడుదల చేశారు. సంకెళ్లు తెంచుకుంటూ సిక్స్‌ప్యాక్ బాడీతో, మెడలో గంటతో రఫ్ లుక్‌లో కనిపించిన ప్రభాస్ పోస్టర్‌ను ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్, హీరోయిన్లు అనుష్క, తమన్నా, నిర్మాతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement