అచ్చు సావిత్రి లాగే ఉంది..! | mahanati team wishes Keerthy suresh | Sakshi
Sakshi News home page

'ఆకాశ వీధిలో అందాల జాబిలి'

Oct 17 2017 11:23 AM | Updated on Oct 17 2017 12:04 PM

Keerthy suresh Mahanati

అలనాటి అందాల తార సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ రోజు (మంగళవారం) కీర్తి పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆకాశ వీధిలో అందాల జాబిలి అనే ట్యాగ్ తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో కేవలం కీర్తి సురేష్ కళ్లను మాత్రమే చూపించారు.

అయితే ఆ కళ్లు సావిత్రివా.. లేక కీర్తి సురేష్ వా..? అన్న విషయం పోల్చుకోలేనంతగా సావిత్రి క్యారెక్టర్ లో ఓదిగిపోయింది కీర్తి సురేష్. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కీలక పాత్రలో దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, సమంత లాంటి హేమా హేమీలు నటిస్తుండటంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement