‘మహానటి’ వాయిదా..! | Mahanati is Scheduled For A World Wide Release On May 9th | Sakshi
Sakshi News home page

Mar 18 2018 10:50 AM | Updated on Mar 18 2018 10:50 AM

Mahanati is Scheduled For A World Wide Release On May 9th - Sakshi

‘మహానటి’ రిలీజ్ డేట్‌ పోస్టర్‌

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బయోపిక్‌ మహానటి. అలనాటి అందాల తార సావిత్రి జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌ జెమినీ గణేష్‌ గా కనిపించనున్నాడు. విజయ్‌ దేవరకొండ, ప్రకాష్‌ రాజ్‌, మోహన్‌ బాబు, సమంత లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య ఏఎన్నార్‌గా నటించేందుకు అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాను ముందుగా మార్చి 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు చిత్రయూనిట్‌. అయితే ఇంకా షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌ లో సినిమాను మే 9న రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. వైజయంతి మూవీస్‌, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement