అచ్చం సావిత్రిలా హావభావాలు | Mahanati Donga Ramudu Song Deleted Scene | Sakshi
Sakshi News home page

May 26 2018 8:21 PM | Updated on May 26 2018 8:27 PM

Mahanati Donga Ramudu Song Deleted Scene - Sakshi

తొలగించిన సన్నివేశంలోని దృశ్యం

మహానటి చిత్రం నుంచి తొలగించిన మరో సన్నివేశాన్ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఏఎన్నార్‌, సావిత్రి, జమున నటించిన దొంగరాముడు(1955) చిత్రంలోని రావోయి మా ఇంటికి.. మావోయ్‌.. మాటున్నది మంచి మాటున్నది... పాట వీడియోను రిలీజ్‌ చేశారు. సావిత్రి.. ఆర్‌.నాగేశ్వర రావులపై చిత్రీకరించిన పాట ఇది. కీర్తి సురేష్‌ అచ్చు సావిత్రిలానే  హావభావాలు పలికిస్తూ ఆకట్టుకుంది. వైజయంతి మూవీస్‌, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన మహానటికి నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. కీర్తీ సురేష్‌ లీడ్‌ రోల్‌లో దుల్కర్‌ సల్మాన్‌, సమంత, విజయ్‌ దేవరకొం‍డ, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement