సినిమాలు అవసరమా? అన్నారు | maganti harshitha chowdary interview tholu bommalata | Sakshi
Sakshi News home page

సినిమాలు అవసరమా? అన్నారు

Nov 15 2019 2:37 AM | Updated on Nov 15 2019 5:13 AM

maganti harshitha chowdary interview tholu bommalata - Sakshi

హర్షిత

‘‘యాడ్‌ఫిల్మ్స్‌ చేయడానికి సినిమాల్లో నటించడానికి చాలా తేడా ఉంది. సినిమాల్లో నటించడం అంత సులువేం కాదు. సెట్‌లో అందరితో కలిసి పోవాలి. ‘తోలుబొమ్మలాట’ సినిమా చేసిన తర్వాత నాలో మరింత ప్రొఫెషనలిజం పెరిగింది. కొత్త విషయాలు నేర్చుకున్నా’’ అని హర్షిత అన్నారు. విశ్వంత్, హర్షిత జంటగా రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్‌ కీలక పాత్రల్లో విశ్వనాథ్‌ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. దుర్గా ప్రసాద్‌ మాగంటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలో విడుదలకానుంది. హర్షిత చెప్పిన సంగతులు..

► నేను ప్రకాశంజిల్లాలో జన్మించాను. మా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది.  నేను మాస్‌ కమ్యూనికేషన్స్‌ చదువుకున్నాను. పై చదువులు చదువుతా. ∙సినిమాల్లోకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పినప్పుడు అవసరమా? అన్నారు. కానీ, ప్రస్తుతం  మంచి సపోర్ట్‌ లభిస్తోంది. తెలుగు అమ్మాయిగా వస్త్రాధారణ విషయంలో నాకు కొన్ని పరిమితులున్నాయి.  

► కొన్ని యాడ్‌ఫిల్మ్స్‌ చేశాను. నా ఫొటోలు చూసిన చిత్రబృందం ‘తొలుబొమ్మలాట’ చిత్రంలో హీరోయిన్‌గా తీసుకున్నారు.  ఇందులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పాత్ర చేశా.  రాజేంద్రప్రసాద్‌గారిలాంటి అనుభవం ఉన్న ఆర్టిస్టులతో నటించడానికి  తొలుత భయం వేసింది.  

► అవకాశాలను ఎంచుకునే స్థాయిలో ప్రస్తుతం నేను లేను. నాకు వచ్చినవాటిని, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాను. నా లైఫ్‌ సినిమానే అనుకోవడం లేదు. ఇతర విషయాలను కూడా ఆలోచిస్తున్నాను.

► సౌందర్యగారు, నిత్యామీనన్‌... ఇలా నేను అభిమానించేవారి నటీమణుల జాబితా చాలానే ఉంది. నా తర్వాతి చిత్రాల గురించి చర్చలు జరుగుతున్నాయి. వివరాలు త్వరలోనే చెబుతా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement