చచ్చిపోతానంటూ చేసిన పోస్ట్‌పై వివరణ ఇచ్చిన నటి | Madhavi Latha Replies Viral Facebook Post | Sakshi
Sakshi News home page

చచ్చిపోతానంటూ చేసిన పోస్ట్‌పై వివరణ ఇచ్చిన నటి

Jan 31 2020 4:02 PM | Updated on Jan 31 2020 4:02 PM

Madhavi Latha Replies Viral Facebook Post - Sakshi

'నచ్చావులే' సినిమా హీరోయిన్ మాధవీలత తన ఫేస్‌బుక్ పేజీలో చచ్చిపోతానన్న వ్యాఖ్యలు చేసి.. కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ కావడంతో ఆమె మరోసారి దీనిపై వివరణ ఇచ్చింది. ఈ విషయంపై ఆమె ఫేస్‌బుక్‌ పేజిలో.. 'డియర్ మీడియా మీరు చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు. నేను బానే ఉన్నాను. ఉంటాను. ఆ న్యూస్‌ని ప్రచారం చేయకండి.

నా ఆరోగ్యం మాత్రమే బాగోలేదు. నేను చేసిన పోస్టు అర్థం ఏంటంటే... మెడిసిన్స్ వాడితే జీవితకాలం తగ్గుతుంది. నాకు మెడిసిన్స్ మీద విరక్తి పుట్టి మాత్రమే అలా చెప్పాను. ఇక రిలాక్స్‌ అవ్వండి. ఇలా జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను మామూలుగానే నా ఆరోగ్య సమస్యలు తెలుపుతూ ఆ పోస్టు చేశాను. నా మైగ్రేన్ సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను' అంటూ ఆమె వివరణ ఇచ్చింది.

నేను చచ్చిపోతా: హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement