చాక్లెట్ బాయ్ మరో ప్రయోగం | Madhavan Next movie gramphone | Sakshi
Sakshi News home page

చాక్లెట్ బాయ్ మరో ప్రయోగం

Aug 28 2016 1:26 PM | Updated on Sep 4 2017 11:19 AM

చాక్లెట్ బాయ్ మరో ప్రయోగం

చాక్లెట్ బాయ్ మరో ప్రయోగం

రొమాంటిక్ హీరోగా లెక్కకు మించి అభిమానులను సొంతం చేసుకున్న సీనియర్ హీరో మాధవన్, ఇటీవల కాలంలో ప్రయోగాల మీద దృష్టి పెట్టాడు. సాలా ఖద్దూస్ సినిమాతో సౌత్ పాటు నార్త్లో కూడా మంచి సక్సెస్...

రొమాంటిక్ హీరోగా లెక్కకు మించి అభిమానులను సొంతం చేసుకున్న సీనియర్ హీరో మాధవన్, ఇటీవల కాలంలో ప్రయోగాల మీద దృష్టి పెట్టాడు. సాలా ఖద్దూస్ సినిమాతో సౌత్ పాటు నార్త్లో కూడా మంచి సక్సెస్ సాధించిన మాధవన్, మరోసారి డిఫరెంట్ సబ్జెక్ట్తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో గ్రామ్ఫోన్ పేరుతో తెరకెక్కనున్న సినిమాకు మాధవన్ అంగీకరించాడు.

ప్రస్తుతం విక్రమ్ వేదా, చార్లీ సినిమాల్లో నటిస్తున్న మాధవన్, ఈ రెండు సినిమాలు పూర్తవ్వగానే గ్రామ్ఫోన్ షూటింగ్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. పూర్తి పల్లె వాతావరణంలో సంగీత నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. కరు పలనియప్పన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబందించి మరిన్ని విశేషాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement