లవ్లీ ఎంటర్‌టైనర్! | Lovely entertainer! | Sakshi
Sakshi News home page

లవ్లీ ఎంటర్‌టైనర్!

Jun 10 2015 11:00 PM | Updated on Sep 3 2017 3:31 AM

లవ్లీ ఎంటర్‌టైనర్!

లవ్లీ ఎంటర్‌టైనర్!

‘‘నిలువవే వాలుకనులదానా వయ్యారి హంస నడకదానా...’’ అని అప్పట్లో ఏయన్నార్ నర్తించిన పాట ఇప్పుడు ఏకంగా టైటిల్‌గా మారింది.

‘‘నిలువవే వాలుకనులదానా వయ్యారి హంస నడకదానా...’’ అని అప్పట్లో ఏయన్నార్ నర్తించిన పాట ఇప్పుడు ఏకంగా టైటిల్‌గా మారింది. మెహెర్‌రాజా, మనీషా జంటగా అవతార్ మెహెర్‌బాబా క్రియేషన్స్ సంస్థ ఈ  పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. శాంతి సూర్యమ్ స్వరాలందించిన ఈ సినిమా పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
 
 నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ పాటలను ఆవిష్కరించారు. ‘‘అన్ని వర్గాలనూ ఆకట్టుకునే ప్రేమకథ ఇది. కుటుంబ బాంధవ్యాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది’’ అని దర్శకుడు చెప్పారు. మెహెర్‌రాజ్ బాగా నటించారని కాదంబరి కిరణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుంకర సత్యనారాయణ, అడిషనల్ ఏసీపీ వసంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement