
రైలు పరిచయం!
లండన్‌లో ఉద్యోగం చేసుకుంటున్న ఆ యువకుడు అనుకోకుండా తన గ్రామానికి రావాల్సి వస్తుంది. లండన్‌లోనే చదువు పూర్తి చేసిన ఆ యువతి కూడా తన గ్రామానికి రావాల్సి
లండన్‌లో ఉద్యోగం చేసుకుంటున్న ఆ యువకుడు అనుకోకుండా తన గ్రామానికి రావాల్సి వస్తుంది. లండన్‌లోనే చదువు పూర్తి చేసిన ఆ యువతి కూడా తన గ్రామానికి రావాల్సి వస్తుంది. ఈ అపరిచితులిద్దరూ ఇండియా ప్రయాణం అవుతారు. ఇండియాకి వచ్చిన తర్వాత తమ తమ గ్రామాలకు వెళ్లడం కోసం రైలు ఎక్కుతారు. అక్కడ ఇద్దరికీ పరిచయం అవుతుంది. ఆ పరిచయం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అనే కథాంశంతో రూపొందిన ఓ తమిళ చిత్రాన్ని ‘లవ్ టు లవ్’ పేరుతో వల్లభనేని అశోక్ తెలుగులోకి విడుదల చేయనున్నారు. ఆర్య, శ్రీయ, ప్రీతికారావ్ ముఖ్య తారలుగా మణికంఠన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మే 1న విడుదల చేయనున్నామని, పాటలకు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరపనున్నామని విడుదల హక్కులు పొందిన కొండపల్లి లక్ష్మీనారాయణ తెలిపారు.