‘లవ్ జంక్షన్’ పాటలు | Love Junction Film Songs Release | Sakshi
Sakshi News home page

‘లవ్ జంక్షన్’ పాటలు

Aug 19 2013 1:44 AM | Updated on Sep 1 2017 9:54 PM

‘లవ్ జంక్షన్’ పాటలు

‘లవ్ జంక్షన్’ పాటలు

‘‘నేటి తరం చేస్తున్న కొత్త ప్రయత్నం ఇది. కొత్త రకం సినిమాలను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటాను. ఇలాంటి చిత్రాలు వస్తే పరిశ్రమ బాగుంటుంది. ఈ చిత్రం పాటలు బాగున్నాయి.

‘‘నేటి తరం చేస్తున్న కొత్త ప్రయత్నం ఇది. కొత్త రకం సినిమాలను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటాను. ఇలాంటి చిత్రాలు వస్తే పరిశ్రమ బాగుంటుంది. ఈ చిత్రం పాటలు బాగున్నాయి. ఈ పాటలు, సినిమా ప్రేక్షకాదరణ పొందుతాయనే నమ్మకం ఉంది’’ అన్నారు డా. రాజేంద్రప్రసాద్.
 
 సుమిత్‌రాయ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ జంక్షన్’. టి. భరత్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి కాదంబరి కిరణ్, ఎస్. బాలాజీకుమార్ సహనిర్మాతలు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న బి.గోపాల్ సీడీని ఆవిష్కరించి రాజేంద్రప్రసాద్, వరుణ్ సందేశ్‌లకు అందజేశారు.
 
 ఈ  టైటిల్ బాగుందని, సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని బి.గోపాల్ అన్నారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఇది యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అని దర్శకుడు అన్నారు. చిత్రనిర్మాణంలో సహకరించిన రామసత్యనారాయణకు కాదంబరి కిరణ్ ధన్యవాదాలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement