గాయనీమణుల జాబితాలో అంజలి | List of female singers Anjali | Sakshi
Sakshi News home page

గాయనీమణుల జాబితాలో అంజలి

Feb 16 2016 3:07 AM | Updated on Sep 3 2017 5:42 PM

గాయనీమణుల జాబితాలో అంజలి

గాయనీమణుల జాబితాలో అంజలి

ఇవాళ హీరోలే కదు హీరోయిన్లూ పాడేస్తున్నారు. చాలామంది తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకోవడానికే వెనుకాడుతున్న...

ఇవాళ హీరోలే కదు హీరోయిన్లూ పాడేస్తున్నారు. చాలామంది తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకోవడానికే వెనుకాడుతున్న ఈ రోజుల్లో సమంతలాంటి కొందరు ఆ ప్రయత్నం చేయడం హర్షణీయమే. మరి కొందరు కథానాయకిలు ఇంకో అడుగు ముందుకేసి పాటలు కూడా పాడేస్తున్నారు. మమతా మోహన్‌దాస్, రమ్యానంబీశన్, లక్ష్మీమీనన్, అనన్యలాంటి వారు ఇప్పటికే తమ గొంతులు సవరించుకుని శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడీ కోవలో నటి అంజలి చేరారు. సంచలన నటిగా గుర్తింపు పొందిన ఈ పదహారణాల ఆంధ్రాపోరి చిన్న గ్యాప్ తరువాత రీఎంట్రీ అయ్యి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ బిజీ నాయకి అయిపోయారు.

కాగా ఇప్పుడు కొత్తగా గాయని అవతారం ఎత్తారు. తమిళంలో నటిస్తున్న యార్ నీ చిత్రంలో ఒక పాట పాడారు అంజలి. ఆ చిత్ర తెలుగు వెర్షన్ చిత్రాంగద  చిత్రంలో కూడా తనే  పాడడం విశేషం. హారర్ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ అధిక భాగం అమెరికాలో జరుపుకోవడం మరో విశేషం. ఈ ద్విభాషా చిత్రంలో సంగీత దర్శకుడు తమన్ సోదరి యామిని ఒక పాట పాడారని సమాచారం. అంజలికి ఇటీవల తెలుగులో గీతాంజలి, డిక్టేటర్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలు వచ్చినా తమిళంలో సరైన హిట్ రాలేదు.

ఈ విషయంలో కూడా అంజలి ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. మరి తాజా చిత్రం యార్ నీ ఈ బ్యూటీకి ఏపాటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇక విమల్ సరసన నటించిన మాప్పిళై సింగం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement