కచ్చా బాదమ్ సాంగ్ ఫేమ్.. ఇప్పుడేంటి ఇలా బార్‌ డ్యాన్సర్‌గా! | Anjali Aroras Viral Thailand Club Dance Videos Go Viral | Sakshi
Sakshi News home page

Anjali Arora: కచ్చా బాదమ్ సాంగ్ ఫేమ్ అంజలి అరోరా.. ఇప్పుడేమో బార్‌ డ్యాన్సర్‌గా!

Aug 21 2025 9:32 PM | Updated on Aug 21 2025 9:32 PM

Anjali Aroras Viral Thailand Club Dance Videos Go Viral

'కచ్చా బాదామ్' సాంగ్తో అప్పట్లో ఫేమస్ అయిన నటి అంజలి అరోరా. తర్వాత పలు రియాలిటీ షోలు, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్లో ది లవ్ ఈజ్ ఫరెవర్, దివాళియాన్, డెలియాన్ చిత్రాల్లో నటించింది. అయితే తాజాగా ఆమె పార్టీలో డ్యాన్స్చేస్తూ కనిపించింది. వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో నటించిన అంజలి అరోరా పబ్ డ్యాన్స్లు చేయడమేంటని నోరెళ్లబెడుతున్నారు.

తాజాగా అంజలి అరోరా థాయ్లాండ్లోని పబ్లో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సినిమా అవకాశాలు తగ్గడంతో ఇలా డ్యాన్స్ ప్రదర్శనలు చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో గౌరవంగా బతకడం కోసం తన వృత్తిని కొనసాగిస్తోందని మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. కాగా... అంజలి అరోరా ఇటీవల ఎంఎంఎస్ లీక్, వీడియో లీక్ వంటి వివాదాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ పబ్లిసిటీతో ఆమె కోట్లలో డబ్బు సంపాదించిందని కూడా ఆరోపణలొచ్చాయి. ఒకప్పుడు స్టార్గా ఉన్న అంజలి ఇప్పుడు పట్టాయాలో క్లబ్ డ్యాన్సర్గా మారిపోవడంతో ఆమె ఫ్యాన్స్ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement