breaking news
Kacha Badam Singer
-
కచ్చా బాదం సింగర్ గుర్తున్నాడా? గుడిసెలో నుంచి కొత్తింట్లోకి!
ఫేమస్ అవడం ఈజీనా? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే కొందరు ఎంత కష్టపడ్డాసరే పెద్దగా గుర్తింపు అందుకోరు. మరికొందరు ఏం చేయకపోయినా సరే ఇట్టే ఫేమస్ అవుతుంటారు. అయితే ఒకటి మాత్రం నిజం! వచ్చిన ఫేమ్‌ను కాపాడుకోవడం అంత ఈజీ అయితే కాదు. అందుకే ఇండస్ట్రీకి చాలామంది తారలు వస్తుంటారు, పోతుంటారు. సోషల్ మీడియాలోనూ అంతే.. సడన్‌గా కొందరు వైరలవుతుంటారు.. అంతలోనే కనుమరుగవుతుంటారు. అలా అప్పట్లో కచ్చా బాదమ్ సింగర్ భూబన్ బద్యాకర్ బాగా పాపులర్ అయ్యాడు.పాత సామాన్లకు పల్లీలుపశ్చిమ బెంగాల్‌కు చెందిన భూబన్ (Bhuban Badyakar).. పాత సామాన్లు, పగిలిన వస్తువులకు పల్లీలు ఇస్తానంటూ వీధుల్లో తిరిగేవాడు. పాట రూపంలోనే పల్లీలు అమ్ముకున్నాడు. ఆ పాట సోషల్ మీడియాలో క్లిక్కవడంతో బాగానే డబ్బు సంపాదించాడు. ఇకపై పల్లీలు అమ్ముకోను, సింగర్‌గా కొనసాగుతా.. నా క్రేజ్ చూసి కిడ్నాప్ చేస్తారేమోనని భయంగా ఉందని పోలీసులను ఆశ్రయించాడు. అతడి బిల్డప్ చూసి అందరూ అవాక్కయ్యారు.కారు కొన్నాక యాక్సిడెంట్కొందరు విమర్శించారు కూడా! దీంతో అతడు నాలుక్కరుచుకున్నాడు. ఆర్టిస్ట్‌గా కొనసాగుతానని, అవకాశాల్లేనప్పుడు మళ్లీ పల్లీలు అమ్ముకోక ఇంకేం చేస్తానని మాట మార్చాడు. అప్పటికీ ఆగలేదు.. సంతోషం, డబ్బు రెండూ ఎక్కువైపోయేసరికి కారు కొన్నాడు. కానీ కారు నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్ అయి కొద్దిరోజులు ఆస్పత్రిపాలయ్యాడు. తర్వాత అడిగినవారికల్లా అప్పులిచ్చుకుంటూ పోయి వసూలు చేయలేకపోయాడు. కొంతకాలంగా కనిపించని సింగర్చూస్తుండగానే సంపాదించినదంతా కరిగిపోవడంతో సొంత ఊరుకు దూరంగా మళ్లీ పల్లీలు అమ్ముకోవడం మొదలుపెట్టాడు. చాలాకాలంగా మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్య ఓ యూట్యూబర్ పుణ్యమా అని అతడెలా ఉన్నాడో తెలిసింది. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉన్న భూబన్ అదే స్థానంలో ఇల్లు కట్టుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. వైరల్ సాంగ్ వల్ల నాకు బాగా సంపాదించాను. కానీ, ఆ పాట కాపీ రైట్స్ ఇప్పుడు నావి కావు, ఓ కంపెనీ సొంతం చేసుకుంది. అలా అని నా జీవితం అక్కడితో ఆగిపోలేదు.జీవితం మెరుగైందిజనాలు నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈవెంట్స్‌కు, రియాలిటీ షోలకు రమ్మని పిలుస్తున్నారు. నా జీవితం కాస్త మెరుగుపడింది. జనాలు నన్ను గౌరవిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భూబన్ గౌరవంగా బతుకుతున్నట్లు పేర్కొన్నాడు. అతడి ఇంట్లో అవార్డులతో పాటు భూబన్ పెయింటింగ్ ఉండటం విశేషం.చదవండి: దీపావళి సినిమాలు.. జోరు మీదున్న హీరో.. వెనకబడ్డ సిద్ధు! -
కచ్చా బాదమ్ సాంగ్ ఫేమ్.. ఇప్పుడేంటి ఇలా బార్ డ్యాన్సర్‌గా!
'కచ్చా బాదామ్' సాంగ్‌తో అప్పట్లో ఫేమస్ అయిన నటి అంజలి అరోరా. ఆ తర్వాత పలు రియాలిటీ షోలు, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్లో ది లవ్ ఈజ్ ఫరెవర్, దివాళియాన్, డెలియాన్ చిత్రాల్లో నటించింది. అయితే తాజాగా ఆమె పార్టీలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో నటించిన అంజలి అరోరా పబ్ డ్యాన్స్‌లు చేయడమేంటని నోరెళ్లబెడుతున్నారు.తాజాగా అంజలి అరోరా థాయ్‌లాండ్‌లోని ఓ పబ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సినిమా అవకాశాలు తగ్గడంతో ఇలా డ్యాన్స్ ప్రదర్శనలు చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో గౌరవంగా బతకడం కోసం తన వృత్తిని కొనసాగిస్తోందని మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. కాగా... అంజలి అరోరా ఇటీవల ఎంఎంఎస్ లీక్, వీడియో లీక్ వంటి వివాదాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ పబ్లిసిటీతో ఆమె కోట్లలో డబ్బు సంపాదించిందని కూడా ఆరోపణలొచ్చాయి. ఒకప్పుడు స్టార్‌గా ఉన్న అంజలి ఇప్పుడు పట్టాయాలో క్లబ్ డ్యాన్సర్‌గా మారిపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.Anjali Arora, Insta dancers ki ‘role model’, Pattaya ke club mein apni ‘talent’ dikhate hue dikhin full jhatka thumka mode on. Wah, reel se deal tak ka asli startup model shayad isi ko kehte hain. pic.twitter.com/2FSwGAQ8QV— NoLawForMen (@MenTooRHuman) August 21, 2025Kacha Badam fame Anjali Arora seems to have made dancing in posh clubs her career.Here she is dancing in a club in Pattaya, Thailand.It is better to earn money than to ask for money. pic.twitter.com/6WzMFJUJrd— Param Choudhary (@Param_117_) August 21, 2025Anjali Arora of Kachcha Badam fame has taken up dancing in posh clubs as a career it seems.Here she is dancing at a Club in Pattaya, Thailand. pic.twitter.com/RXgWZit44Z— Sensei Kraken Zero (@YearOfTheKraken) August 21, 2025 -
సోషల్ మీడియా సామాన్యులకు వరమా? శాపమా?
ఒకప్పుడూ ఇలాంటి సోషల్ మీడియాలు లేని ఆ కాలం చాలా ప్రశాంతంగ సాగిపోయింది. ఏ రోజూ..ఏం వింటాం అనే ఉత్కంఠ, టెన్షన్ మాత్రం లేనేలేవు. ఏదైనా బిజినెస్ మంచిగా సాగాలన్న పేపర్ ప్రకటనలతోనే కొంతమంది ప్రముఖులతోనే ప్రచారం చేయించుకోవడం జరిగేది. ఆలస్యమైనా నిలదొక్కుకునే వారు. సజావుగా సాగేది. అది వ్యాపారమనే కాదు, ఓ వ్యక్తి ఉన్నతి, లేదా సృజనాత్మకత గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ఆ ఫేమ్ అలా నిలబడేది. ఒకవేళ కాలం కలిసిరాక కష్టాలు ఎదురైనా కొద్దిమందికే తెలిసేది. ఒకవేళ పత్రికల్లో రాసినా పాపం అన్నట్లుగా ఆ వ్యక్తి గురించి చెప్పిచెప్పనట్లుగా చెప్పేవారు. అంతే తప్ప! ఊదరగొట్టి, బెదరగొట్టి పడేసేలా మాత్రం రాసేవారు కాదు. ఇక ఎప్పుడైతే ఇంటర్నెట్ ఓ రేంజ్లో అందరికి సుపరిచితమై ట్విట్టర్, ఇన్‌స్టా, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలు హవా నడవడం మొదలైందో..అప్పటి నుంచి అసలైన సమస్య వచ్చిందనాలా? లేక టెక్నాజీతో దూసుకుపోతున్నాం అనలా తెలియని గందరగోళంలా మారిపోయింది స్థితి. ఎందుకిలా చెబుతున్నానంటే.. సెకనులో తెచ్చిపెట్టే స్టార్డమ్.. ఈ సోషల్ మీడియా అసామాన్యుడిని ఓవర్‌నైట్ సెలబ్రెటీని చేసేస్తుంది. ఓ సామాన్య వ్యాపార వేత్తని సెకండ్లలో ఫేమస్ చేసేస్తుంది. దీంతో వారంతా తమ రంగంలో ఓ రేంజ్లో దూసుకుపోతున్నారు. అంతవరకు బాగానే ఉంది. మధ్యలో ఏదో జరిగి దివాలా తీశాడో ఇక అంతే! ఇక ఆ తర్వాత కూడా వద్దు రా! నన్ను వదిలేయండన్న వినకుండా వెంట పడి వాడి గురించి వీడియో తీసి పెట్టేస్తారు. అంతకుముందు ఏదైతే ఆయా వ్యక్తులకు పాపులారిటీ తెచ్చిపెట్టిందో అదే వాళ్ల కష్టాలకూ, కన్నీళ్లకు కారణమవుతోంది. అలా బలైన వాళ్లు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా ఈ టిక్‌టాక్‌లు యూట్యూబ్‌లతో పేరుగాంచిన కచ్చా బాదం సింగర్ నుంచి ఇటీవల వంటలతో పేరు సంపాదించుకున్న కుమారి ఆంటీ వరకు అందరూ ఈ సోషల్ మీడియా బాధితులే అనాలి. ఎందుకంటే..? నిజానికి ఈ ఇద్దర్నీ గమనిస్తే అందులో ఒకరు రోడ్డుపై వేరుశనగలు అమ్ముకుంటే మరోకరు పొట్టకూటి కోసం రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుతున్నారు మరొకరు(కుమారీ ఆంటీ). వారిలో ఒకరేమో! ..వేరశనగలు విక్రయించేందుకు పాడిన పాట ఎవరో వీడియో తీసీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యిపోయారు. ఆ ఇమేజ్ అతడి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగిపోయేలా చేసింది. ఆ తర్వాత అతను ప్రైవేట్ ఆల్బమ్‌లో పాట పాడే స్థాయికి కూడా వెళ్లిపోయాడు. అయితే అతనికి ఒక్కసారిగా వచ్చిన ఇమేజ్, సంపద నిలుపుకోవడం చేతకాలేదు. మళ్లీ యథాస్థితికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న దాని గురించి కూడా ఈ సోషల్ మీడియా ద్వారానే తెలుసుకున్నాం. ఇక్కడొకటి గుర్తించుకోండి కిందపడితే సాయం చేసేందుకు వచ్చే చేతులు కూడా కొన్నే. పైగా ఇది వరకటిలా మనపై వీడియో కాదుకదా మన గోడువినేందుకు కూడా ముందుకు రారు. అతడి పనై పోయింది తెలుసుకునేది ఏముంది అన్నట్లుంటుంది వ్యవహారం. ఇక వంటలతో ఫేమ్ సంపాదించికున్న సాయి కూమారి ఆంటీ దగ్గరకు వస్తే..ఆమె మాదాపుర్‌లో ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతంలో రోడ్డు పక్కన ఏ హంగు ఆర్భాటం లేకుండా జస్ట్ ఓ డేరా కింద హోటల్ నడుపుకుంటుండేది. అందరి దగ్గర వెజ నాన్‌వెజ్ ఏవో రెండు మూడు రకాలు ఉంటాయి ఈమె దగ్గర వెజ్‌కి సంబంధించిన నాన్‌వెజ్‌కి సంబంధించిన పలురకాలు ఉండటమేగాక కాస్త రుచిగా కూడా ఉండటంతో అనతి కాలంలో మంచి పేరు వచ్చేసింది ఆమెకు. దీనికీ తోడు ఈ సోషల్ మీడియా కూడా తోడవ్వడంతో ఆమె బిజనెస్ కూడా ఓ రేంజ్లో దూసుకుపోవడం మొదలైంది. మంచి లాభలతో ఓ రేంజ్లో సాగింది. ఆ ప్రాంతమంతా ఆమె హోటల్ కారణంగా జాతరలా మారి ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడే స్థాయికి వచ్చేసింది. మాములుగానే మన నగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇక ఇలాంటి వాటి కారణంగా ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడితే అధికారులు ఊరుకుంటారా?. అందులోకి సామాన్యుడి మీదకి లాఠీ ఝళిపించడం చాలా తేలిక. ఇంకేముంది నీ హోటల్ కారణంగానే ట్రాఫిక్ ఏర్పడిందంటూ అధికారులు కూమారీ ఆంటీ హోటల్ని కాస్త మూయించేశారు. నా పొట్టమీద కొట్టొద్దు అంటూ కూమారి ఆంటీ పెడబొబ్బలు పెట్టినా వినిపించుకోలేదు అధికారులు. పార్కింగ్‌కి స్థలం ఇచ్చేంత స్థోమత లేదని ఆమె గోడు వెల్లబోయగా, అదంతా మాకు తెలియదు మీ కారణంగానే ఈ సమస్య అంటూ ఆమెపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఈ రెండు ఘటనలు చూస్తే సోషల్ మీడియా ఫేమే ఆ ఇద్దరికీ కష్టాలు కూడా తెచ్చి పెట్టిందనలా అంటే..ఓ వ్యక్తిలోని టాలెంట్‌ని అందరికీ సుపరిచితం చేసి అతడికో దారి చూపించడం వరకు ఓకే. ప్రతిక్షణం ఆ వ్యక్తినే ఫోకస్ పెట్టేలా చేస్తే వచ్చే సమస్యలే ఇవి. పైగా ఆయా వ్యక్తుల నేపథ్యాన్ని తెలుసుకుని వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తారు. కనీసం వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛకు విలువనియ్యకుండా బజారున పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్. అక్కడితో ఆగకుండా ఆమె ఇంత సంపాదించేస్తుందంటూ అదేపనిగా ఊదరగొట్టేస్తారు. ఆ తర్వాత ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వాళ్లపై దాడి జరిగితే..మళ్లీ ఇది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది. అసలేంటిదీ? మనం ఏం చేస్తున్నాం. ఈ టెక్నాలజీ మాయలోపడి మనుషులమనే విషయమే మర్చిపోతున్నామా!. లేక అవతల వాళ్ల జీవితాలను ట్రెండ్ చేసి సొమ్ము చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఒక విద్యార్థి ఫెయిలైతేనే ఆ మాష్టారు ఎంతో హుందాగా దగ్గరకు తీసుకుని ఇంకో అవకాశం ఉంది పాసవ్వచ్చు అని ధైర్యంగా చెబుతారు. అందరి ముందు అతడిని నిలబెట్టేసి ఏడిపించరు కదా!. అలాంటిది ఇక్కడ జీవితాలకు సంబంధించినవి నెట్టింట వైరల్ చేస్తున్నాం. వీటిని ట్రెండ్ చేసి ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్. వాళ్లలో ఉండే సృజనాత్మకతను, టాలెంటన్ని పదిమందికి తెలిసేలా చేసేవరకు చాలు. మరీ లోతుగా వెళ్లిపోయి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయకండి. ముఖ్యంగా వాస్తవాలేంటో తెలియకుండా కథలు అల్లేయొద్దు. ఇంతకుమునుపు ఇలాంటి వాటి విషయాల్లో వార్తపత్రికలను, మీడియాను తిట్టిపోసేవారు. కానీ ఇప్పుడవే బెటర్‌గా వ్యవహరిస్తున్నాయి. కానీ ఈ టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా ఇన్ఫ్లున్సెర్లు మాత్రం ఎవరు ముందు విషయం షేర్ చేశారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనే దిశగా వెనకాముందు చూడకుండా ఏదీపడితే అది పోస్ట్ చేసి జీవితాలు అల్లకల్లోలమయ్యి, నాశనమయ్యేలా చేసేస్తున్నారు. మీలో దాగున్న ఏదో ఒక స్కిల్‌తో సొమ్ము ఆర్జిచండి ఇలా పక్కోళ్ల జీవితాలకు సంబంధించి అన్నింటిని ట్రెండ్ చేసి సోమ్ము చేసుకోకండి. అది ఎవ్వరికీ మంచి కాదు. ముఖ్యంగా టెక్నాలజీని మనకు ప్రయోజనకరంగా చేసుకోకపోయిన పర్లేదు గానీ హాని చేసేలా మాత్రం చెయ్యొద్దు!. (చదవండి: చికూ ఫెస్టివల్ గురించి విన్నారా? ఆ ఫ్రూట్ కోసమే ఈ పండుగ!) -
ఆర్థిక కష్టాలతో రోడ్డెక్కిన కచ్చాబాదం సింగర్‌కు బుల్లితెరపై ఛాన్స్!
ఒక్కరోజులో వచ్చే స్టార్డమ్ ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు. కానీ దాన్ని దీర్ఘకాలం నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. అందుకు కచ్చా బాదం సింగర్ భూబన్ బద్యాకర్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన భూబన్ కచ్చా బాదమ్ పాట పాడుతూ పల్లీలు అమ్ముకునేవాడు. ఆ పాట సోషల్ మీడియాలో క్లిక్ కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. పాటలు, ప్రదర్శనలతో బోలెడంత డబ్బు రావడంతో కారు కూడా కొనుక్కున్నాడు. కానీ కారు నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్‌కు గురై ఆస్పత్రి పాలయ్యాడు. మరోవైపు అడిగినవారికల్లా అప్పులు ఇచ్చుకుంటూ వెళ్లిపోయాడే కానీ దాన్ని తిరిగి వసూలు చేయలేకపోయాడు. చివరికి ఉన్నదంతా కరిగిపోవడంతో సొంత ఊరుకు దూరంగా మళ్లీ పల్లీలు అమ్ముకోవడం మొదలుపెట్టాడు. తనకు లోకజ్ఞానం లేకపోవడంతో ఓ కంపెనీ మూడు లక్షలివ్వగానే వాళ్లు చూపించిన పత్రాల మీద సంతకం పెట్టాడు. దీంతో అతడు కచ్చా బాదమ్ పాట మాత్రమే కాదు ఏ పాట యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినా కాపీరైట్ ఇష్యూ వస్తోంది. ఇన్ని మోసాలు, కష్టాల తర్వాత అద్దె ఇంట్లో బతుకు వెల్లదీస్తున్న భూబన్ త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నాడు. ఓ బెంగాలీ సీరియల్లో తండ్రి పాత్రకు ఓకే చెప్పాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైందట. ఒక్క పాత్రతోనే రూ.40 వేల దాకా సంపాదించిన అతడు మున్ముందు కూడా మంచి అవకాశాలు వస్తే నటించేందుకు రెడీగా ఉన్నానంటున్నాడు.


