కాంట్రవర్సి సినిమా ఫస్ట్‌లుక్‌ కేన్స్‌లో విడుదల

Lihaaf First Look Release In Cannes Film Festival - Sakshi

ప్రముఖ అవార్డు గ్రహీత దర్శకుడు రహత్‌ కాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లిహాఫ్‌’(మెత్తని బొంత) సినిమా తొలి పోస్టరు మాంటోలో జరుగుతున్న71వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్లో విడుదలయ్యింది. కాన్స్‌లో విడుదల చేసిన ఈ పోస్టర్లో ఒక ఎర్రని బొంత మీద ఇద్దరు మహిళల పాదాలు ఉన్నాయి. వాటిలో ఒకరి పాదాలకు బాగా అలకంరించిన మువ్వలు ఉండగా, మరొకరి పాదాలకు సాదా మువ్వలున్నాయి. ప్రముఖ ఉర్డూ రచయిత ఇస్మై చుగ్తాయి రచించిన వివాదస్పద పుస్తకం ‘లిహాఫ్‌’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తనిష్తా ఛటర్జీ రచయిత ‘చుగ్తాయి’ పాత్రలో నటిస్తుండగా, సోనల్‌ సెహగల్‌ ‘బేగమ్‌ జాన్‌’ పాత్రలో నటిస్తున్నారు. భర్త నిరాదరణకు గురైన మహిళ మానసిక సరిస్థితి ఎలా ఉంటుంది, ఆ సమయంలో ఆమెను ఎలాంటి విషయాలు ఆకర్షిస్తాయనే ఇతివృత్తంతో తెరకెక్కుతుంది ఈ సినిమా. 

స్వలింగ సంపర్కం నేపథ్యంలో ‘చుగ్తాయి’ రచించిన ఈ కథ లక్నోలో ప్రారంభమవుతుంది. ఈ కథనంతా బేగమ్‌ జాన్‌ చిన్న మేనకోడలు వివరిస్తుంది. అక్కడ ఒంటరిగా ఉంటున్న బేగమ్‌ జాన్‌, తన పరిచారికతో ఎలాంటి సంబంధాన్ని పెట్టుకున్నది, దాని పర్యావసనాలు ఏమిటనే నేపథ్యంలో సాగుతుంది. తనకు, పరిచారికకు మధ్య ఉన్న సంబంధం గురించి మేనకోడలికి తెలియడంతో బేగమ్‌ జాన్‌ ఆమెను చంపేస్తుంది. చుగ్తాయి రాసిన ‘లిహాఫ్‌’, అలానే ఆమె స్నేహితుడు సాదత్‌ హసన్‌ మంటో రాసిన పుస్తకం ‘బూ’ రెండింటిల్లోను అశ్లీలత ఎక్కువగా ఉందనే ఆరోపణలు ఎదుర్కొన్నాయి.

ఈ చిత్రానికి కజ్మీ, తారిక్‌ ఖాన్‌, ఉత్పల్‌ ఆచార్య నిర్మాతలుగా వ్వవహరిస్తుండగా, ఆస్కార్‌ అవార్డు గ్రహిత మార్క్‌ బషేట్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top