మణిరత్నం ఆదుకోవాలి.. సినీకార్మికుడి ఫిర్యాదు

Lightman Allegations Against Mani Ratnam - Sakshi

దర్శకుడు మణిరత్నంపై సినీ లైట్‌మెన్‌ పోలీస్‌ కమిషనర్‌కు సోమవారం ఫిర్యాదు చేశాడు. అనంతరం మణిమారన్‌ మీడియాతో మాట్లాడుతూ తాను సినీ లైట్‌మెన్‌గా పని చేశానని లైట్‌మెన సంఘంలో సభ్యుడిగా ఉన్నానన్నాడు.10 ఏళ్ల క్రితం తాను దర్శకుడు మణిరత్నం చిత్రాలకు పనిచేశానని చెప్పాడు. కాగా అప్పుడు నటుడు అభిషేక్‌బచ్చన్‌ హీరోగా  మణిరత్నం తెరకెక్కించిన గురు చిత్ర షూటింగ్‌ స్థానిక పెరంబూరులో జరినప్పుడు తాను విష జ్వరానికి గురయ్యానని తెలిపాడు.

ఆస్పత్రిలో చేరగా చికిత్సకు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారన్నారు. తాను పేదవాడిని కావడంతో తన వద్ద అంత డబ్బు లేకపోవటంతో దర్శకుడు మణిరత్నం ఇంటికి వెళ్లి సాయం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిపాడు. చివరికి ఆర్థికసాయం కోరుతూ ఒక లేఖ కూడా రాశానని, అయినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆరోపించారు. తన భార్య పని చేసి తన కుటుంబాన్ని పోషిస్తోందని చెప్పాడు.

లైట్‌మెన్‌ సంఘం నుంచి రూ. 2 లక్షలు వైద్య సాయానికి అందించాల్సిందిగా కోర్టు ఆదేశించిందని చెప్పాడు. అయితే ఆ సంఘం నిర్వాహకులు తనను రూ.20 వేలు లంచం ఇవ్వాలని అడిగారన్నాడు. తాను అప్పు చేసి ఆ డబ్బును సంఘంకు ఇచ్చానని, అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం లైట్‌మెన్‌ సంఘం రూ. 2 లక్షలు కాకుండా లక్ష రూపాయలే ఇచ్చిందని చెప్పాడు.

మరో లక్ష ఇవ్వాల్సి ఉందన్నాడు. తను మణితర్నం చిత్రాలకు పని చేశానని, ఆయన మానవత్వంతో తనకు ఆర్థికసాయం చేయాలని కోరారు. అందుకోసం తాను స్థానిక నుంగంబాక్కమ్‌ వళ్లువర్‌ కోట్టం వద్ద కుటుంబంసహా నిరాహార దీక్ష చేయడానికి పోలీసుల అనుమతి కోరడానికే కమిషనర్‌ కార్యాలయానికి వచ్చినట్లు మణిమారన్‌ తెలిపాడు. ఈ సంఘటన కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top