నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం | Lifetime achievement award for jamuna | Sakshi
Sakshi News home page

నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం

Sep 15 2019 3:05 AM | Updated on Sep 15 2019 3:05 AM

Lifetime achievement award for jamuna - Sakshi

జమున, ఇషా, జయసుధ

‘‘పండంటి కాపురం’ చిత్రంలో జయసుధ నా కూతురిగా నటించింది. ఆమెకి కూడా అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు ఈ లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు రావడం ఆనందంగా ఉంది’’ అని సీనియర్‌ నటి జమున అన్నారు. వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఆరేళ్లుగా బుల్లి తెర అవార్డులను అందిస్తున్న విష్ణు బొప్పన గత రెండేళ్లుగా వెండి తెర అవార్డులను కూడా అందిస్తున్నారు. ఈ ఏడాది జమునకు లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్టు, జయసుధకు లెజెండరీ అవార్డుతో పాటు పలువురు కళాకారులకు అవార్డులను అందజేశారు. జయసుధ మాట్లాడుతూ– ‘‘గతంలో ‘పండంటి కాపురం’లో జమునమ్మకు కూతురిగా నటించాను.

నలభై ఏళ్ల తర్వాత ఆమె, నేను ఒకే వేదిక మీద కలిసి అవార్డును తీసుకోవడం గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘నాకు సపోర్ట్‌ అందిస్తున్న శతాబ్ధిటౌన్‌ షిప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి ధన్యవాదాలు. వారు తోడుగా ఉన్నారు కాబట్టే ఈ కార్యక్రమాలు చేస్తున్నాను’’ అన్నారు విష్ణు బొప్పన. ‘‘నాకు ఆల్‌ రౌండర్‌ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు బాబూమోహన్‌. ‘‘బెస్ట్‌ డైలాగ్‌ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు సంపూర్ణేష్‌ బాబు. ఫ్యామిలీ మూవీగా  ‘సమ్మోహనం’ చిత్రానికి వీకే నరేశ్, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రానికి బ్యూటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును ఇషా రెబ్బా, ‘ఎఫ్‌ 2’కి కమెడియన్‌గా రఘుబాబు ఇలా పలువురు తారలకు అవార్డులను ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement