మెగా హీరోతో మరోసారి..! | Lavanya Tripathi In Varun Tej Film | Sakshi
Sakshi News home page

Apr 9 2018 11:49 AM | Updated on Apr 9 2018 2:24 PM

Lavanya Tripathi In Varun Tej Film - Sakshi

మిస్టర్‌ సినిమాలో వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి

‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ‘ఫిదా, తొలిప్రేమ’ చిత్రాలతో ఘన విజయాలు సొంతం చేసుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. బిబో శ్రీనివాస్ సమర్పణలో జాగర్లమూడి సాయిబాబా, రాజీవ్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రానికి ‘ఘాజీ’  ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకుడు.

స్పేస్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన కథానాయికగా ఇప్పటికే అదితిరావు హైదరీని ఎంపిక చేయగా.. ఇప్పుడు మరో కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసారు. మిస్టర్‌ సినిమాలో కలిసి నటించిన ఈ జోడి ఇప్పుడు మరో సారి తెరమీద సం‍దడి చేసేందుకు రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ స్పేస్ డ్రామా కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరుకు మొదలవ్వనుంది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement