ఏపీలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదల..!

Lakshmis NTR Movie Will Be Released In Andhra Pradesh On May 1 - Sakshi

సాక్షి, అమరావతి : సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ఏపీలో విడుదల కానుంది. మే 1న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను ఏపీలో విడుదల చేస్తున్నామని డైరెక్టర్‌ వర్మ వెల్లడించారు. ఎన్టీఆర్‌ అనుభవించిన నరకం ఏపీ ప్రజలు తెలుసుకోబోతున్నారని ట్విటర్‌లో తెలిపారు. అత్యంత వివాదాస్పదమైన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యే వరకు రిలీజ్‌పై హైకోర్టు స్టే విధించటంతో అప్పటినుంచి చిత్రయూనిట్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు పి.మోహన్‌రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

(‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’పై హైకోర్టు విచారణ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top