గుండె జారి గల్లంతయ్యిందే! | Lakshmi Rai as Item Song in Lawrence Movie | Sakshi
Sakshi News home page

గుండె జారి గల్లంతయ్యిందే!

May 8 2016 10:58 PM | Updated on Sep 3 2017 11:41 PM

గుండె జారి గల్లంతయ్యిందే!

గుండె జారి గల్లంతయ్యిందే!

వెన్నెలింత వేడిగా.. ఎండ ఇంత చల్లగా... అనే పాట గురించి తెలిసే ఉంటుంది. ప్రేమలో ఫుల్‌గా మునిగిపోయి, వెంకీ, నయనతార ‘తులసి’లో పాడుకున్న పాట ఇది.

వెన్నెలింత వేడిగా.. ఎండ ఇంత చల్లగా... అనే పాట గురించి తెలిసే ఉంటుంది. ప్రేమలో ఫుల్‌గా మునిగిపోయి, వెంకీ, నయనతార ‘తులసి’లో పాడుకున్న పాట ఇది. ఇప్పుడు రాయ్ లక్ష్మి.. అదేనండి.. లక్ష్మీరాయ్ హాట్ హాట్ ఫొటోగ్రాఫులు చూసిన కుర్రకారు ఎండ ఏదో వెన్నెలేదో తెలియక తికమకపడిపోతున్నారు. ఆ రేంజ్‌లో ఉన్నాయి అమ్మడి ఫొటోలు. హిందీ చిత్రం ‘జూలీ-2’లో ఇంతకుముందు ఏ చిత్రంలోనూ కనిపించనంత హాట్‌గా కనిపించనున్నారు రాయ్ లక్ష్మి. ఆ ఫొటోలు చూసి, ఇంత హాట్‌గా కనిపిస్తే, మా గుండె జారి గల్లంతయిపోతుందని ఆమె ఫ్యాన్స్ తీపి బాధను వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రం బాలీవుడ్‌లో తనకు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు రాయ్ లక్ష్మి. ఆ సంగతలా ఉంచితే.. ఒకవైపు కథానాయికగా నటిస్తూ, అడపా దడపా ఆమె ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ ‘బలుపు’, పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాల్లో ప్రత్యేకపాటలో కనువిందు చేశారు రాయ్‌లక్ష్మి. తాజాగా లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ‘మొట్ట శివ కెట్ట శివ’ చిత్రంలో ఐటెమ్ సాంగ్‌లో మెరవబోతున్నట్లు సమాచారం. ఈ పాట చిత్రానికే హైలెట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ  చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement