ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద లక్ష్మీ పార్వతి దీక్ష

lakshmi parvathi deekha at NTR Ghat

హైదరాబాద్‌ : దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి గురువారం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మౌన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘ కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్ను బాధపెట్టాయి.  ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర కూర్చుంటే... ఆ బాధల నుంచి కాస్త ఉపసమనం దొరుకుందని వచ్చాను. నా భర్తకు జరిగిన అన్యాయంపై ఎన్నో యేళ్లుగా పోరాటం చేస్తున్నా. నా పోరాటానికి తప్పనిసరిగా నా భర్త తోడు ఉన్నారు. ఆయన ఆత్మ నాకు అండగా ఉంటుంది. నా జీవిత చరిత్రపై లక్ష్మీ వీరగ్రంధం సినిమా తీయడం చట్టవిరుద్ధం. అనుమతి లేకుండా సినిమా తీస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ సినిమాకు నా అనుమతి తప్పనిసరి. అయితే లక్ష్మీ వీరగ్రంధం సినిమా గురించి నన్ను ఎవరూ ఇంతవరకూ సంప్రదించలేదు’  అని అన్నారు. మరోవైపు ఎన్టీ  రామారావు జీవితకథ ఆధారంగా రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.

ఆరు భాషల్లో లక్ష్మీ వీరగ్రంధం

అయితే దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీ వీరగ్రంధం చిత్రాన్ని ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. పూర్తి ఆధారాలతో ఈ సినిమా తీస్తున్నానని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. అలాగే లక్ష్మీ వీరగ్రంధం సినిమా టీజర్‌ను కేతిరెడ్డి ఇవాళ మీడియాకు విడుదల చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top