నచ్చినోళ్లతోనే.... | Lakshmi Menon back with Vishaal | Sakshi
Sakshi News home page

నచ్చినోళ్లతోనే....

Oct 11 2014 1:35 AM | Updated on Sep 2 2017 2:38 PM

నచ్చినోళ్లతోనే....

నచ్చినోళ్లతోనే....

కాలం కలిసొస్తే ఎన్ని కబుర్లైనా చెబుతారు. ప్రస్తుతం అలాంటి బడాయిలే పోతోంది నటి లక్ష్మీమీనన్.

కాలం కలిసొస్తే ఎన్ని కబుర్లైనా చెబుతారు. ప్రస్తుతం అలాంటి బడాయిలే పోతోంది నటి లక్ష్మీమీనన్. ఈ కుంకీ కథానాయకి చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కోలీవుడ్‌లో అపజయం ఎరగని హీరోయిన్‌గా లక్ష్మీమీనన్‌కు పేరుంది. తొలి చిత్రం కుంకి నుంచి ఈ మధ్య తెరపైకొచ్చిన మంజాపై వరకు ఆమె ఖాతాలో వరుస హిట్లే నమోదయ్యాయి. ఈ మలయాళి భామ ఈ విజయాలను ఎంజాయ్ చేస్తూ తన మార్కెట్‌ను పెంచుకుంటోంది. ఎవరెలా అనుకున్నా విజయాలు ప్రవర్తనలో మార్పుకు కారణం అవుతాయి.

నటి లక్ష్మీమీనన్ ఇందుకు అతీతం కాదు. తొలుత అవకాశాలొస్తే చాలనుకున్న ఈ కేరళ కుట్టి ఆ తర్వాత మంచి కథా పాత్రలు కావాలని కోరుకుంది. అలాంటిది ఆమె తాజాగా తాను నటించే చిత్రాల్లో హీరోలు తనకు నచ్చిన వారై ఉండాలని షరతులు పెడుతోందట. ఇలాంటి కండీషన్ ఇంతకు ముందు ఏ నటి విధించి ఉండరు. ఇప్పటి వరకు రెండవ కేటగిరి హీరోల సరసన నటించిన ఈ అమ్మడిప్పుడు ప్రముఖ హీరోలు, మాస్ ఇమేజ్ కలిగిన హీరోలతో డ్యూయెట్లు పాడాలని ఆశిస్తోందని సమాచారం. దీంతో వర్ధమాన నటుల చిత్రాలను నిరాకరిస్తోందనే ప్రచారం జరుగుతోంది.

అంతటితో ఆగకుండా తన ఆశను నెరవేర్చుకునే పనిలో భాగంగా ప్రముఖ నటులను పరిపరి విధాలుగా పొగడ్తలతో ముంచెత్తుతోంది. అలాగే తనకు తెలిసిన దర్శకులతో సిఫార్సు చేసుకునే పనిలో పడిందట. మరి అలాంటి ఈ నెరజాణ నటుడు కార్తి సరసన నటించే అవకాశాల్ని ఎందుకు జారవిడచుకుందోనంటున్నారు కోలీవుడ్ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement