వీడియో వైరల్‌ : మద్యం మత్తులో సినీతారల డ్యాన్స్‌ ! | Kushbu, Sukanya dance video viral in Social media | Sakshi
Sakshi News home page

వీడియో వైరల్‌ : మద్యం మత్తులో సినీతారల డ్యాన్స్‌ !

Feb 11 2018 4:33 PM | Updated on Feb 11 2018 4:33 PM

Kushbu, Sukanya dance video viral in Social media - Sakshi

సాక్షి, చెన్నై : తమిళ ప్రముఖ సినీతారల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్ చల్‌ చేస్తోంది. ఖుష్బూ సుందర్‌, సుకన్యలు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. చెన్నైలోని సవేరా హోటల్‌లో విందు సందర్భంగా ప్రముఖ హిందీ సాంగ్‌ 'పియా తూ అబ్‌ తొ ఆజా' ప్లే చేశారు. సాంగ్‌కి తగ్గట్టుగా ఖుష్బూ అద్భుతమైన స్టెప్పులు వేశారు. తర్వాత సుకన్య కూడా ఖుష్బూ స్టెప్పులకు ఏమాత్రం తీసిపోకుండా డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ ఇద్దరు సీనియర్‌ నటీమణుల వయసు పెరిగినా స్టెప్పుల్లో ఏమాత్రం గ్రేస్ తగ్గనట్లు కనిపించింది. ఖుష్బూ, సుకన్యలు డ్యాన్స్‌ వేస్తుంటే పక్కనే ప్రముఖ నటుడు మనోబాల కూడా ఉన్నారు. అయితే మద్యం మత్తులో ఖుష్బూ, సుకన్యలు చిందేశారంటూ సోషల్‌ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.  

ఖుష్బూ ఇటీవలే విడుదలైన తెలుగు చిత్రం అజ్ఞాతవాసిలో నటించిన విషయం తెలిసిందే. 200లకు పైగా చిత్రాల్లో నటించిన ఖుష్బూ తమిళ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఖుష్బూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement