ఎన్టీఆర్ కు తెగ నచ్చేసిన 'కుమారి' | 'Kumari 21F is a heart touching story' says Jr.NTR | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ కు తెగ నచ్చేసిన 'కుమారి'

Nov 20 2015 8:25 PM | Updated on Sep 3 2017 12:46 PM

సున్నితమైన ఫీలింగ్స్ను స్టోరీ లైన్గా ఎంచుకుని స్క్రీన్ను షేక్ చేసే డైరక్టర్ సుకుమార్.

సున్నితమైన ఫీలింగ్స్ను స్టోరీ లైన్గా ఎంచుకుని స్క్రీన్ను షేక్ చేసే డైరెక్టర్ సుకుమార్. అతడు మొదటిసారి నిర్మాతగా మారి కథాకథనాలు అందించిన చిత్రం 'కుమారి 21 ఎఫ్'. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ల కన్నా ముందు ప్రశంసలను అందుకుంటోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్ర విజయం పట్ల ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కుమారి 21 ఎఫ్... యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనసు కూడా దోచేసిందట. గురువారమే సినిమా చూసిన ఎన్టీఆర్.. కథ హృదయానికి హత్తుకునేలా ఉందని.. ఇలాంటి బ్రేవ్ అండ్ బోల్డ్ రైటింగ్కు గాను సుకుమార్కు హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, దర్శకుడు సూర్య ప్రతాప్లు ఓ రేంజ్ లో రాణించారని.. అలాగే హీరోయిన్ హెబ్బా, హీరో తరుణ్ నటన బెస్ట్ అంటూ అభినందించాడు యంగ్ టైగర్. సో సుకుమార్ మార్క్ సున్నితమైన, స్వచ్ఛమైన భావోద్వేగాలను బోల్డ్ గా చూపించడంలో దర్శకుడు సూర్య ప్రతాప్ విజయం సాధించినట్టే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement