మాజీ సీఎం కొడుకా.. మజాకా | kumara swamy'son film with puri jagannath | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం కొడుకా.. మజాకా

Mar 17 2015 6:23 PM | Updated on Mar 22 2019 1:53 PM

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దేవెగౌడ తన కుమారుడు నిఖిల్ కుమారస్వామిని హీరోగా పెట్టి 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సినిమా తీస్తున్నారు.

బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దేవెగౌడ తన కుమారుడు నిఖిల్ కుమారస్వామిని హీరోగా పెట్టి 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సినిమా తీస్తున్నారు. తెలుగుచిత్ర రంగంలో 50 కోట్ల రూపాయలు చిన్న మొత్తమే కావచ్చుకానీ కన్నడలో ఇంత పెట్టుబడి పెట్టి సినిమా తీయడం ఇదే మొదటి సారి. ఎందుకంటే సాధారణంగా కన్నడ సినిమాలకు సరాసరిగా నాలుగు కోట్ల రూపాయలకు మించి ఖర్చుపెట్టరు. సూపర్ స్టార్ సినిమాలకు కూడా 12 కోట్ల రూపాయలకు మించి ఖర్చుపెట్టరు. పలు తెలుగు చిత్రాలను హిట్‌చేసిన ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించనున్నట్టు కన్నడ సినిమా వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే పూరి ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.  ఒకేసారి తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయాలనుకోవడం వల్లనే ఈ చిత్ర నిర్మాణానికి 50 కోట్లు ఖర్చుపెడుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి.

 కుమారస్వామి దేవెగౌడ రాజకీయాల్లోకి రాకముందు చిత్రరంగంలో త్రిపాత్రాభినయం చేశారు. చిత్ర నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటనపట్ల అమితాసక్తి కలిగిన ఆయన కుమారుడు నిఖిల్ పలు అంతర్జాతీయ సంస్థల్లో నటన కోసం శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కోసం విదేశాలకు వెళుతున్నాడట.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement