దసరాకి రాజా | Kumar Raja movie launch | Sakshi
Sakshi News home page

దసరాకి రాజా

Apr 23 2018 12:06 AM | Updated on Apr 23 2018 12:06 AM

Kumar Raja movie launch - Sakshi

హీరో, హీరోయిన్లపై క్లాప్‌ ఇస్తున్న రాజ్‌ కందుకూరి

కుమార్‌ రాజా, సాయికుమర్, ప్రియా చౌదరి, ప్రియాంకా శర్మ, ఆక్సాఖాన్, జీత్‌సింగ్‌ ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కుమార్‌ రాజా’. టెల్‌ మీ బాస్‌ పిక్చర్స్‌ పతాకంపై శ్రీచక్ర మల్లికార్జున స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో శ్రీకాంత్, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్, నిర్మాత రాజ్‌ కందుకూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

హీరో, హీరోయిన్లపై రాజ్‌ కందుకూరి క్లాప్‌ ఇచ్చారు. శ్రీచక్ర మల్లికార్జున మాట్లాడుతూ– ‘‘యాక్షన్, లవ్, కామెడీ, సెంటిమెంట్స్, ఎమోషన్‌.. ఇలా అన్ని అంశాలతో కథ చక్కగా కుదిరింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్‌ మొత్తం పూర్తి చేయాలనుకుంటున్నాం. దసరాకి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement