నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు దాటిన 'క్రిష్ 3' | 'Krrish 3' crosses Rs.100 crore mark in four days | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు దాటిన 'క్రిష్ 3'

Nov 5 2013 1:49 PM | Updated on Apr 3 2019 6:23 PM

నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు దాటిన 'క్రిష్ 3' - Sakshi

నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు దాటిన 'క్రిష్ 3'

బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ నటించిన 'క్రిష్ ౩' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును అధిగమించి రికార్డు వసూళ్ల దిశగా దూసుకు పోతోంది.

న్యూఢిల్లీ: బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ నటించిన 'క్రిష్ ౩' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును అధిగమించి రికార్డు వసూళ్ల దిశగా దూసుకు పోతోంది. దీపావళికి రెండు రోజులు ముందుగా నవంబర్ 1న విడుదలయిన ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ. 100 కోట్ల పైగా వసూళ్లు సాధించిందని మార్కెట్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు.

శుక్రవారం విడుదలయిన ఈ సినిమా సోమవారం నాటికి 108.6 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఒక్కరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కూడా 'క్రిష్ 3' నిలిచిందని వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే ఈ సినిమా రూ. 35.91 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిందని తెలిపారు. ఇంతవరకు ఏ సినిమా కూడా ఒక్కరోజులో ఇంత కలెక్షన్ సాధించలేదని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement