అనుష్కతో కృష్ణవంశీ ప్రయోగం | Krishna vamsi next film with anushka | Sakshi
Sakshi News home page

అనుష్కతో కృష్ణవంశీ ప్రయోగం

Nov 15 2015 12:29 PM | Updated on Sep 3 2017 12:32 PM

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా ఓ వెలుగు వెలిగిన కృష్ణ వంశీ ఇటీవల కాలంలో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. చందమామ, గోవిందుడు అందరివాడేలా లాంటి హిట్ సినిమాలు చేసినా, తనస్టామినా...

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా ఓ వెలుగు వెలిగిన కృష్ణ వంశీ ఇటీవల కాలంలో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. చందమామ, గోవిందుడు అందరివాడేలా లాంటి హిట్ సినిమాలు చేసినా, తనస్టామినా ప్రూవ్ చేసుకునే స్థాయి కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. సందేశాత్మక చిత్రాలను కూడా కమర్షియల్ సక్సెస్లుగా మార్చిన ఈ స్టార్ డైరెక్టర్ చాలా కాలం తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతున్నాడు.

ఇటీవల కాలంలో ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలు మాత్రమే తెరకెక్కిస్తూ వచ్చిన కృష్ణవంశీ, గతంలో అంతఃపురం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. జగపతిబాబు, సాయికుమార్ లాంటి నటులు ఉన్నా సినిమా కథ అంతా సౌందర్య చుట్టూ తిరిగేలా రూపొందించి సూపర్ హిట్ సాధించాడు. ఇంత కాలం తరువాత మరోసారి అదే ఫార్ములాను రిపీట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం టాలీవుడ్లో సూపర్ ఫాంలో ఉన్న అనుష్క ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు కృష్ణవంశీ. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు రుద్రాక్ష అనే టైటిల్ను నిర్ణయించినా, ఆ టైటిల్ ఎవరో రిజిస్టర్ చేయించుకోవటంతో ఇప్పుడు మరో టైటిల్ కోసం ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement