రీ-షూట్‌ కోసం ఐదు కోట్ల ఖర్చు...!

Krish Re-shoots  Manikarnika Scenes - Sakshi

టాప్‌ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకటి బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ కాగా, మరొకటి వీరనారి రాణీ లక్ష్మీ భాయ్‌ జీవితగాథ మణికర్ణిక. కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మణికర్ణిక ప్రస్తుతం రీషూట్‌ జరుపుకుంటోంది. 

గతేడాది మేలో షూటింగ్‌ ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. ఈ ఏడాది సమ్మర్‌లో రీలీజ్‌ కావాల్సి ఉంది. అయితే కొన్ని కీలక సన్నివేశాల అవుట్‌ పుట్‌పై అసంతృప్తితో ఉన్న క్రిష్‌. రీషూట్‌ చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే రిలీజ్‌ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం రీ షూట్‌ జరుపుకుంటుండగా, ఈ కారణంగా బడ్జెట్‌ మరో ఐదు కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, మణికర్ణికకు సీనియర్‌ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ కథను సమకూర్చిన విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్‌ జరిపి మణికర్ణికను ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు క్రిష్‌ సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్‌ కూడా ఈ మధ్యే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది కూడా.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top