కుర్రాడి ప్రేమకథ | Sakshi
Sakshi News home page

కుర్రాడి ప్రేమకథ

Published Sat, Dec 30 2017 1:13 AM

Kotha Kurradu in post production work - Sakshi

శ్రీరామ్, శ్రీప్రియ జంటగా రాజానాయుడు దర్శకత్వంలో లైట్‌ ఆఫ్‌ లైఫ్‌ లవ్‌ క్రియేషన్స్‌ పతాకంపై పదిలం లచ్చన్న దొర (లక్ష్మణ్‌) నిర్మిస్తున్న చిత్రం ‘కొత్త కుర్రాడు’. ఈ చిత్రం షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకొని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ –‘‘మంచి లవ్‌సోరీ. నైతిక విలువలతో కూడిన చిత్రమిది. రామ్, ప్రియ కొత్తవారైనప్పటికీ పోటీ పడి నటించారు. విలన్‌ పాత్రలో చెబ్రోలు శ్రీను ఆకట్టుకుంటాడు. సాయి ఎలెందర్‌ సంగీతం చిత్రానికి హైలెట్‌ అవుతుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా ఈ చిత్రం ఉంటుంది, ఫిబ్రవరిలో విడుదల చేయటానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ మదిరాజ్, సంగీతం: సాయి ఎలెందర్‌.

Advertisement
Advertisement