అనుష్క న్యూ లుక్‌.. ఇది జస్ట్ ఝలక్‌

Kona Venkat Comment On Anushka New Slim Look - Sakshi

జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క.. తిరిగి స్లిమ్‌ లుక్‌లోకి వచ్చేందుకు చాలా కాలంగా కష్టపడుతోంది. ముఖ్యంగా బాహుబలి 2, సింగం 3 సినిమాల్లో అనుష్క లుక్‌ పైగా విమర్శలు వినిపించటంతో ఇక స్వీటీ కెరీర్‌ ముగిసినట్టే అని భావించారు. తరువాత వచ్చిన భాగమతిలో అనుష్క కాస్త తగ్గినట్టుగా కనిపించినా గతంలో కనిపించినంత గ్లామరస్‌గా మాత్రం కనిపించలేదు.

దీంతో మరోసారి సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన స్వీటీ ప్రస్తుతం తన లుక్‌ మీద దృష్టి పెట్టింది. తాజాగా బయటకు వచ్చిన అనుష్క ఫొటోలు అభిమానులకు షాక్‌ ఇచ్చాయి. వైట్‌ డ్రెస్‌లో స్లిమ్‌ లుక్‌లో కనిపిస్తున్న అనుష్క లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ లుక్‌ పై అనుష్కతో సినిమాను నిర్మిస్తున్న కోన వెంకట్‌ స్పందించారు. ‘ఇది జస్ట్‌ ఝలక్‌ అంతే.. సినిమాలోతన  ఫైనల్‌ లుక్‌ కోసం వెయిట్ చేయండి. స్వీటీ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా కనిపించబోతోంది’ అంటూ ట్వీట్ చేశారు.

హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో మాధవన్‌ కీలక పాత్రలో నటించనున్నారు. అనుష్కతో పాటు అంజలి, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోన వెంకట్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top