విశాల్.., మాట నిలబెట్టుకుంటున్నాడు | kollywood Hero Vishal Straight telugu Film | Sakshi
Sakshi News home page

విశాల్.., మాట నిలబెట్టుకుంటున్నాడు

Nov 2 2016 11:28 AM | Updated on Sep 4 2017 6:59 PM

విశాల్.., మాట నిలబెట్టుకుంటున్నాడు

విశాల్.., మాట నిలబెట్టుకుంటున్నాడు

తమిళ సినీ రంగంలో సత్తా చాటుతున్న తెలుగబ్బాయి విశాల్. తెలుగు నిర్మాత కొడుకైన విశాల్, కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కేవలం నటుడిగానే కాదు, అక్కడ నడిగర్ సంఘం ఎలక్షన్స్ లో...

తమిళ సినీ రంగంలో సత్తా చాటుతున్న తెలుగబ్బాయి విశాల్. తెలుగు నిర్మాత కొడుకైన విశాల్, కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కేవలం నటుడిగానే కాదు, అక్కడ నడిగర్ సంఘం ఎలక్షన్స్ లో కూడా సత్తా చాటిన విశాల్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కీలకంగా మారాడు. అయితే తమిళ నాట ఎన్ని విజయాలు సాధించినా.. మాతృభాషల్లో ఒక్క సినిమా కూడా చేయలేదన్న బాధ ఎప్పుడు ఉంటుంది. అందుకే చాలా సార్లు తనకు స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనుందని ప్రకటించాడు విశాల్.

తమిళ్ లో బిజీగా ఉండటంతో ఇన్నాళ్లు సాధ్యం కాలేదు. అయితే తాజాగా ఈ నల్లనయ్య ఓ తెలుగు సినిమాకు ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. లౌక్యం, డిక్టేటర్ లాంటి హిట్ సినిమాలను అందించిన శ్రీవాస్ డైరెక్షన్లో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు విశాల్. తన ఇమేజ్ కు తగ్గట్టుగా మాస్ మాసాల కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న శ్రీవాస్ సినిమా తనకు తెలుగులో మంచి లాంచింగ్ అవుతుందని భావిస్తున్నాడట. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి ఫిబ్రవరిలో తెలుగు ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement