పెదరాయుడిగా సంపూర్ణేశ్ | Kobbari Matta official teaser starring Sampoornesh Babu in triple action | Sakshi
Sakshi News home page

పెదరాయుడిగా సంపూర్ణేశ్

May 23 2016 7:50 PM | Updated on Sep 4 2017 12:46 AM

పెదరాయుడిగా సంపూర్ణేశ్

పెదరాయుడిగా సంపూర్ణేశ్

సంపూర్ణేశ్ బాబు.. ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. హృదయకాలేయం చిత్రంతో విలక్షణ నటన కనబరిచి అభిమానులను కుప్పలుగా సంపాదించుకుని బర్నింగ్స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు.

హైదరాబాద్: సంపూర్ణేశ్ బాబు.. ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. హృదయకాలేయం చిత్రంతో విలక్షణ నటన కనబరిచి అభిమానులను కుప్పలుగా సంపాదించుకుని బర్నింగ్స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆయన తిరిగి అదే టీంతో చేస్తున్న చిత్రం 'కొబ్బరి మట్ట'. ఈ చిత్ర టీజర్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. రుపక్ రోనాల్డ్స్న్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంపూర్ణేశ్ బాబు గతంలో బడా హీరోలు చేసిన పాత్రలను అనుకరించినట్లు కనిపిస్తోంది.

ఈ చిత్రంలో మూడు పాత్రల్లో ఆయన కనిపిస్తున్నారట. ముఖ్యంగా తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో ఆయన పెద రాయుడిలా కనిపించారు. అప్పటి పెద రాయుడు చిత్రంలో మోహనబాబు ఎలాంటి వేషధారణలో కనిపించారో అచ్చం అలాగే. ఒక మహిళను కొడుతుండగా.. ఎంట్రీ ఇచ్చిన మహిళల గొప్పతనం ఏమిటో ఓ భారీ డైలాగ్లో గుక్క తిప్పుకోకుండా కనిపించారు సంపూర్ణేష్. ఈ డైలాగ్ పూర్తవడంతోనే ట్రైలర్ కూడా ముగిసిపోతుంది. అన్నట్లు ఈ చిత్రంలో బాహుబలి స్ఫూప్ కూడా ఉందంట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement