హంతకుడు ఎవరు? | Killer Movie Audio Launch | Sakshi
Sakshi News home page

హంతకుడు ఎవరు?

Mar 27 2019 12:28 AM | Updated on Jul 12 2019 4:40 PM

Killer Movie Audio Launch - Sakshi

విజయ్‌ ఆంటోని, ఆషిమా, అర్జున్‌

అర్జున్, విజయ్‌ ఆంటోని, అషిమా నర్వాల్‌ ప్రధాన పాత్రల్లో ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కిల్లర్‌’. ‘హంతకుడు’ అన్నది ఉపశీర్షిక. బి.ప్రదీప్‌ సమర్పణలో దియా మూవీస్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రం స్నీక్‌ పీక్‌ టీజర్‌ను రిలీజ్‌ చేయగా, బిగ్‌ సీడీని అర్జున్‌ విడుదల చేశారు. విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ– ‘‘అర్జున్‌గారితో కలిసి ఈ సినిమా చేయటం నా అదృష్టం. ఆయన యాక్షన్‌ స్టైల్‌ కింగ్‌. ఆండ్రూ నా స్నేహితుడే.

ఆషిమా ఈ సినిమాతో ప్రేక్షకులకు డ్రీమ్‌ గర్ల్‌గా మారుతుంది. ప్రదీప్‌ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తీశారు. చదలవాడ శ్రీనివాసరావుగారు నాకు గాడ్‌ ఫాదర్‌. భాష్యశ్రీ నాకు మరో సోదరుడు. తను లేకుండా నా సినిమా తెలుగులోకి రాదు. హాలీవుడ్‌ తరహా సాంకేతికత మా సినిమాలో చూస్తారు. మేలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో పోలీస్‌ పాత్ర చేశా. ఇదొక విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌. నా పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది.

విజయ్‌ ఆంటోనీ మంచి మనిషి. ఈ చిత్రంలో ‘కిల్లర్‌’ ఎవరనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది’’ అన్నారు అర్జున్‌. ‘‘నాకు తెలుగు రాకున్నా తెలుగు వారికి నచ్చే సినిమా తీశా. విజయ్‌ ఆంటోని నా స్నేహితుడు. తన వల్లే ఈ సినిమా చేశాను. అర్జున్‌గారు ఈ సినిమా చేయటమే మా మొదటి సక్సెస్‌. టెక్నికల్‌గా నెక్ట్స్‌ లెవెల్‌ మూవీ అవుతుంది’’ అన్నారు ఆండ్రూ లూయిస్‌. సంగీత దర్శకుడు సైమన్‌ కె.కింగ్, పాటల రచయిత భాష్యశ్రీ, అషిమా నర్వాల్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మ్యూక్స్‌.

Advertisement
 
Advertisement
Advertisement