హాలీవుడ్‌ టచ్‌

Kill Bill actor Michael Madsen joins Anushka Shetty and Madhavan in Silent - Sakshi

హారర్‌ చిత్రం ‘భాగమతి’ తర్వాత ‘సైలెంట్‌’ అనే మూకీ థ్రిల్లర్‌లో కనిపించనున్నారు అనుష్క. మాధవన్‌ హీరోగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్‌ హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కోన వెంకట్‌ నిర్మాణంతో పాటు రచయితగానూ వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. క్రాస్‌ఓవర్‌ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. అంటే కేవలం కొంతమంది మన భాష నటులు మిగతా అంతా వేరే భాష నటులు కనిపిస్తారు.

ఇందులో హాలీవుడ్‌ నటుల టచ్‌ ఎక్కువగానే కనిపించనుంది. ‘కిల్‌బిల్‌’లాంటి క్లాసిక్‌ హిట్‌ చిత్రంలో నటించిన మైఖెల్‌ మేడ్‌సన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. ‘కిల్‌ బిల్‌ ఫస్ట్‌ పార్ట్‌’తోపాటు ‘ఫారెస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ డెడ్, ఫ్రీ విల్లీ 2’ చిత్రాల్లో కనిపించారు మైఖెల్‌. మార్చి నుంచి సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్‌ అమెరికాలోనే జరుపుకోనుంది. ఈ చిత్రం కోసం అనుష్క బరువు తగ్గి, కొత్త లుక్‌లో కనిపించనున్నారని కోన వెంకట్‌ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top