మెగాస్టార్ పాటకు.. అమెరికాలో స్టాండింగ్‌ ఒవేషన్‌!

khaidino150 song on SteveHarvey show with standing ovation - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీఇచ్చిన ఖైదీ నంబర్‌ 150 ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసినిమాతో తనలోని గ్రేస్‌ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు మెగాస్టార్‌. మెగా మేనియాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన ఈ సినిమా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఓ అంతర్జాతీయ రియాలిటీ షోలో ఖైదీ నంబర్‌ 150 సినిమాలోని సన్నజాలి లా నవ్వేస్తోందిరో పాటకు డ్యాన్స్‌చేశారు అక్కడి డ్యాన్సర్‌.

ఫాక్స్‌ టీవీలో నిర్వహించే షో టైం ఎట్‌ ది అపోలో షోలో ఈ పాటను ప్రదర్శించారు. ఎమ్మీ అవార్డ్‌ విన్నర్‌ స్టీవ్‌ హార్వే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షోలో ష్రాయ్‌ ఖన్నా టీం ఈ పాటను ప్రదర్శించారు. మెగాస్టార్ పాట అక్కడ కూడా సూపర్‌ హిట్ అయ్యింది. డ్యాన్స్‌ పూర్తయిన తరువాత ఆడిటోరియంలోని ఆడియన్స్‌ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ష్రాయ్‌ ఖన్నా టీంను అభినందించారు. ఈ వీడియోను మెగా అభిమానుల కోసం తన ఫేస్‌ బుక్‌ పేజ్‌లో షేర్‌ చేశాడు చిత్ర నిర్మాత చిరు తనయుడు రామ్ చరణ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top