ప్రేమ.. స్నేహం... | Kerintha Release Date June 12th 2015 | Sakshi
Sakshi News home page

ప్రేమ.. స్నేహం...

Jun 7 2015 10:13 PM | Updated on Sep 3 2017 3:23 AM

ప్రేమ.. స్నేహం...

ప్రేమ.. స్నేహం...

కాలేజీ లైఫ్ అంటే అందరికీ ఇష్టమే. స్నేహం, ప్రేమ కలగలిసిన భావోద్వేగాలతో జీవితం పసందుగా ఉంటుంది.

కాలేజీ లైఫ్ అంటే అందరికీ ఇష్టమే. స్నేహం, ప్రేమ కలగలిసిన భావోద్వేగాలతో జీవితం పసందుగా ఉంటుంది. వాటికి  తెరరూపాన్నిస్తూ,  సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ముఖ్య తారలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘కేరింత’. అడివి సాయికిరణ్ దర్శకుడు. ఈ నెల 12న  చిత్రం విడుదల కానుంది.  ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ-‘‘  ‘కొత్త బంగారులోకం’ సినిమా తర్వాత కొత్త వాళ్లతో సినిమా చేయాలనుకున్నాం. ఆ టైమ్‌లో సాయికిరణ్ చెప్పిన ఈ కథ నచ్చింది. దీనికి సుమంత్ అశ్విన్ హీరోగా బాగుంటుందనుకున్నాం. ప్రేమ, స్నేహం నేపథ్యంలో అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: విజయ్ చక్రవర్తి.
 

Advertisement
 
Advertisement
Advertisement