చేయనంటే చేయను! | Keerthy Suresh Avoids Glamorous Roles | Sakshi
Sakshi News home page

చేయనంటే చేయను!

Oct 17 2017 2:10 AM | Updated on Oct 17 2017 2:14 AM

Keerthy Suresh Avoids Glamorous Roles

సినిమా అన్నాక.. గ్లామర్‌ సీన్‌ అన్నాక హీరోయిన్లు గ్లామరస్‌గా కనిపించక తప్పదు. ‘సీన్‌ డిమాండ్‌ చేస్తే తప్పదు కదండీ. అక్కడ లిప్‌ లాక్‌ చేయకపోతే సీన్‌ పండదు. ఆ సీన్‌లో బికినీలోనే కనిపించాలి. లేకపోతే తేలిపోతుంది. అందుకే చేశా’ అని కొందరు కథానాయికలు అంటుంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్‌ హోమ్లీ క్యారెక్టర్స్‌లో కనిపిస్తోన్న ‘నేను శైలజ’ ఫేమ్‌ కీర్తీ సురేశ్‌ కూడా భవిష్యత్తులో ఇలాంటి చిలక పలుకులు పలుకుతారన్నది చాలామంది ఊహ. కానీ, ‘నేను గ్లామర్‌ పాత్రలు చేయనంటే చేయను’ అని కుండబద్దలు కొట్టేశారీ మలయాళ బ్యూటీ. ‘‘నాకు గ్లామర్‌ పాత్రలు సరిపడవు. సంప్రదాయంగా ఉంటేనే ప్రేక్షకులు నన్ను ఇష్టపడతారు. అందుకే గ్లామర్‌ పాత్రలు తిరస్కరిస్తున్నా. ఇదే విషయం గురించి ఐదేళ్ల తర్వాత అడిగినా నా సమాధానం ఇదే. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే ఎంచుకుంటున్నా’’ అంటున్నారు కీర్తి. ప్రస్తుతం పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్‌ సినిమాలో ఓ నాయికగా, ‘మహానటి’లో టైటిల్‌ రోల్‌లో చేస్తున్నారామె.

Advertisement
 
Advertisement
Advertisement