ఈ ప్రయాణం ఓ జ్ఞాపకం | keerthi suresh is penguin movie shooting completed | Sakshi
Sakshi News home page

ఈ ప్రయాణం ఓ జ్ఞాపకం

Nov 4 2019 3:42 AM | Updated on Nov 4 2019 3:42 AM

keerthi suresh is penguin movie shooting completed - Sakshi

కీర్తీ సురేష్‌

‘పెంగ్విన్‌’ చిత్రబృందానికి టాటా చెప్పేశారు కథానాయిక కీర్తీ సురేష్‌. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో కీర్తీ సురేష్‌ నటించిన లేడీ ఓరియంటెడ్‌ మూవీ ఇది. ‘పేట’ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు ఓ నిర్మాత. ఈ చిత్రంలో గర్భవతి పాత్రలో నటించారు Mీ ర్తి.‘‘పెంగ్విన్‌’ చిత్రీకరణ ముగిసింది. ఈ సినిమా ప్రయాణం నా కెరీర్‌లో జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సహకరించిన చిత్రబృందానికి ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని కీర్తీసురేష్‌ పేర్కొన్నారు. తెలుగులో ‘మిస్‌ ఇండియా, గుడ్‌లక్‌ సఖీ’ సినిమాలతో పాటు హిందీలో ‘మైదాన్‌’ అనే చిత్రంతో కీర్తీ సురేష్‌ మస్త్‌ బిజీగా ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement