కేసీఆర్ జీవితంతో సినిమా | KCR's life as a movie | Sakshi
Sakshi News home page

కేసీఆర్ జీవితంతో సినిమా

Oct 20 2016 10:58 PM | Updated on Aug 13 2018 4:03 PM

కేసీఆర్ జీవితంతో సినిమా - Sakshi

కేసీఆర్ జీవితంతో సినిమా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు (కేసీఆర్) జీవిత విశేషాలతో ఓ చిత్రం తెరకెక్కనుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు (కేసీఆర్) జీవిత విశేషాలతో ఓ చిత్రం తెరకెక్కనుంది. మధుర శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో ధర్మపధ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘1969లో తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న మా నాన్న చెప్పిన సంగతులు వింటూ పెరిగాను.
 
  నేను విన్న అప్పటి సంగతులు, చూసిన ఈనాటి సంఘటనలు నాలోని దర్శకుణ్ణి నిద్రపోనివ్వలేదు. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలకు తీసిపోని సవాళ్లను కేసీఆర్ ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకుని, ఆ చరిత్రను తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నా. కేసీఆర్ పుట్టినరోజు సంద ర్భంగా 2018 ఫిబ్రవరి 17న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement