‘ఆ విషయంలో ప్రభుదేవా నాకు చాలా సాయం చేశారు’ | Katrina Kaif Shares Rehearsing Video Prabhu Deva | Sakshi
Sakshi News home page

‘ఆ విషయంలో ప్రభుదేవా నాకు చాలా సాయం చేశారు’

Oct 26 2018 8:53 PM | Updated on Oct 26 2018 8:53 PM

Katrina Kaif Shares Rehearsing Video Prabhu Deva - Sakshi

సాధరణంగా ఏదైనా డ్యాన్స్‌ చేసేటప్పుడు అది జాజ్‌ డ్యాన్సా, ఫోకా లేకా మరేదైనా అనే విషయం ముందే తెలుస్తుంది. కానీ ప్రభుదేవాతో డ్యాన్స్‌ చేసేటప్పుడు మాత్రం ఎంజాయ్‌ చేయడం తప్ప దానికి పేరు పెట్టలేం అంటున్నారు కత్రినా కైఫ్‌. అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌, కత్రినా ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం థగ్స్‌ ఆఫ్‌ హిందోస్థాన్‌. ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం సురయ్యా టైటిల్‌తో ఉన్న పాట ప్రోమోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ పాటలో కత్రినా డ్యాన్స్‌తో మెస్మరైజ్‌ చేశారు. శరీరాన్ని స్ప్రింగ్‌లా వంచుతూ కత్రినా చేసిన మూవ్‌మెంట్స్‌ అభిమానులను ఫిదా చేశాయి. అయితే ఈ క్రేడిట్‌ అంతా కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవాకే చేందుతుందంటున్నారు కత్రినా. ఈ పాట రిహార్సిల్స్‌లో భాగంగా తీసిన వీడియోను కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రభుదేవాను ప్రశంసలతో ముంచెత్తారు.

‘ప్రభుదేవా స్టైల్‌ను నిర్వచించడం చాలా కష్టం. ఆయన శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రభుదేవా తన కొరియోగ్రఫీతో ఈ పాటకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశారు. నేను ఆయన అనుకునే స్టైల్‌లో డ్యాన్స్‌ చేయడానికి చాలా సహాయం చేశారు. కొన్ని సార్లు కోపంతో కన్నీళ్లు వచ్చాయి. కానీ చివరకూ చాలా ఎంజాయ్‌ చేశాం’ అంటూ కత్రినా వీడియోను పోస్ట్‌ చేశారు. పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియోను దాదాపు  19 లక్షల మందికిపైగా చూశారు.

Advertisement
 
Advertisement
Advertisement