
మోహన్‌బాబు:
కరుణానిధిగారి మరణం తీరని లోటు. ఆయన నిజమైన లెజెండ్. ఆయన తన పథకాలతో లక్షల మంది జీవితాల్ని ప్రభావితం చేశారు. ఎంతోమందికి జీవితంపై ఆశ పుట్టించారు. తన రచనతో లక్షల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సోదరులు స్టాలిన్, అళగిరి.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
రజనీకాంత్:
ఇదొక బ్లాక్ డే. ఈ రోజును నేను జీవితంలో ఎప్పుడూ మరచిపోలేను. కరుణానిధిగారి ఆత్మకు భగవంతుని సన్నిధిలో శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
రమ్యకృష్ణ:
ఈ భూమిపై నుంచి నింగికేగిన వారంతా మనల్ని వదిలి వెళ్లినట్లు కాదు. వాళ్లు మన హృదయాల్లో, ఆలోచనల్లో ఎప్పుడూ జీవిస్తుంటారు. కరుణానిధిగారి ఆత్మకు శాంతి చేకూరాలి.
విశాల్:
కరుణానిధి అయ్య మరణం తీరని లోటు. గొప్ప నాయకుడైన ఆయన ఇక లేరు అనే విషయం నన్ను ఎంతో బాధిస్తోంది. సినీ, రాజకీయ రంగానికి ఆయన ఎనలేని సేవ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
విష్ణు:
కరుణానిధిగారి మరణం తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, తమిళ సోదర, సోదరీమణులకు ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా.
రాధిక:
ఇది నిజంగా మాకు చీకటి రోజు. నా మనసంతా ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలతో నిండిపోయింది. తమిళుల కోసం ఎంతో పోరాడారు. ఓ గొప్ప నాయకుడు మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన మనతో లేకున్నా ఆయన సంకల్పం ఎప్పుడూ జీవంతోనే ఉంటుంది.
ఖుష్బూ:
నెల క్రితం నేను ఆయనతో కలిసి ఫొటో దిగాను. గొప్ప నాయకుడైన ఆయన్ను కలవడం అదే చివరిసారి అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. మేం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం అప్పా (నాన్నా).
రితేష్ దేశ్‌ముఖ్:
ఈరోజు భారతదేశం ఓ గొప్ప నాయకుణ్ని కోల్పోయింది. కరుణానిధి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన తమిళనాడు రాష్ట్రానికి, ప్రజలకు చేసిన సేవ అపారమైనది.
మాధవన్:
రచయిత, డైనమిక్ నాయకుడు కరుణానిధిగారు కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.
ప్రసన్న:
ద్రవిడ ఉద్యమ మూల స్తంభం కరుణానిధిగారు. డీఎంకే అధినేతగా 50 ఏళ్లు కొనసాగిన ఆయన మరణం తీరని లోటు.
హన్సిక:
దేశంలోనే గొప్ప నాయకుడైన కరుణానిధిగారు లేని లోటును జీర్ణించుకునే ధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, తమిళులకు ఆ దేవుడు ప్రసాదించాలి.