గాల్లో కార్తీ! | Karthi to Learn Pilot Training! | Sakshi
Sakshi News home page

గాల్లో కార్తీ!

May 3 2016 10:45 PM | Updated on Sep 3 2017 11:20 PM

గాల్లో కార్తీ!

గాల్లో కార్తీ!

‘పోదాం... పెకైగిరిపోదాం...’ అంటూ ‘ఊపిరి’లో సందడి చేసిన కార్తీ ఇప్పుడు నిజంగా గాల్లో ఎగరడానికి శ్రద్ధగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

‘పోదాం... పెకైగిరిపోదాం...’ అంటూ ‘ఊపిరి’లో సందడి చేసిన కార్తీ ఇప్పుడు నిజంగా గాల్లో ఎగరడానికి  శ్రద్ధగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎందుకూ అనుకుంటున్నారా? మణిరత్నం దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రంలో కార్తీ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. ఇందులో కార్తీ పైలట్ పాత్ర పోషిస్తున్నారు. దీని కోసమే పైలట్‌గా శిక్షణ తీసుకోవడానికి రెండు వారాల క్రాష్ కోర్సులో చేరిపోయారు కార్తీ. ఈ ట్రైనింగ్ తర్వాత కార్తీ విమానం నడిపేస్తారనుకుంటే పొరపాటే. ఆ స్థాయిలో శిక్షణ తీసుకోవడం లేదు. జస్ట్ కొన్ని మెలకువలు నేర్చుంటుకుంటున్నారట. కాక్‌పిట్‌లో పైలట్ ఎలా కూర్చుంటాడు? అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? వంటి పలు విషయాల మీద ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రెండు వారాల్లో శిక్షణ పూర్తయ్యాక షూటింగ్ మొదలుపెడతారట.

Advertisement
 
Advertisement
Advertisement