ఖైదీ యాక్షన్‌ | Karthi Next Movie With Lokesh Kanagaraj | Sakshi
Sakshi News home page

ఖైదీ యాక్షన్‌

Oct 16 2019 1:20 AM | Updated on Oct 16 2019 1:20 AM

Karthi Next Movie With Lokesh Kanagaraj - Sakshi

‘యుగానికొక్కడు, ఆవారా, నా పేరు శివ, ఊపిరి, ఖాకీ’ వంటి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీ నటించిన తాజా చిత్రం ‘ఖైదీ’. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ విడుదల చేస్తున్నారు.

కార్తీ మాట్లాడుతూ– ‘‘సాంగ్స్, రొమాన్స్‌ లేకుండా కేవలం యాక్షన్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉండే వైవిధ్యమైన చిత్రమిది. ఈ చిత్రాన్ని  చూసి, ప్రేక్షకులందరూ థ్రిల్‌ అవుతారు’’ అన్నారు. కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ– ‘‘రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా ఉండే సినిమా ఇది. పాటలు, హీరోయిన్‌ లేకుండా డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో తండ్రి, కూతురి సెంటిమెంట్‌ బాగుంటుంది. కార్తీ సినిమాల్లోనే ‘ఖైదీ’ ఓ ప్రత్యేక సినిమా అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సి.ఎస్‌., కెమెరా: సత్యన్‌ సూర్యన్‌.

Advertisement
 
Advertisement
Advertisement