కాష్మోరాగా కార్తీ | Karthi Kashmora First look | Sakshi
Sakshi News home page

కాష్మోరాగా కార్తీ

Aug 18 2016 10:20 AM | Updated on Sep 4 2017 9:50 AM

కాష్మోరాగా కార్తీ

కాష్మోరాగా కార్తీ

ఇన్నాళ్లు లవర్ బాయ్గా, మాస్ హీరోగా ఆకట్టుకున్న కార్తీ ఇప్పుడు అన్న సూర్య బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు. తొలిసారిగా ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్నకాష్మోరా సినిమాలో...

ఇన్నాళ్లు లవర్ బాయ్గా, మాస్ హీరోగా ఆకట్టుకున్న కార్తీ ఇప్పుడు అన్న సూర్య బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు. తొలిసారిగా ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్నకాష్మోరా సినిమాలో నటిస్తున్నాడు కార్తీ. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 60 కోట్లతో పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార, శ్రీదివ్యలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో కార్తీ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండటం కూడా సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. భారతీయ సినీ చరిత్రలో తొలిసారిగా 3డి ఫేస్ స్కానింగ్, 360 డిగ్రీ ఓమ్నీ డైరెక్షనల్ కెమరా టెక్నాలజీస్ను ఈ సినిమా కోసం వినియోగించారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. కార్తీ కాష్మోరా లుక్లో కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కాష్మోరా, దీపావళి కానుకగా రిలీజ్కు రెడీ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement