కరీంనగర్ ప్రేమకథ! | Karimnagar love story | Sakshi
Sakshi News home page

కరీంనగర్ ప్రేమకథ!

Apr 2 2016 10:50 PM | Updated on Sep 3 2017 9:05 PM

కరీంనగర్ ప్రేమకథ!

కరీంనగర్ ప్రేమకథ!

ప్రేమ, వినోదం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈరోజుల్లో ప్రేమకథా చిత్రమ్’. దీనికి ‘కరీం నగర్‌లో’ అనేది ఉపశీర్షిక.

ప్రేమ, వినోదం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈరోజుల్లో ప్రేమకథా చిత్రమ్’. దీనికి ‘కరీం నగర్‌లో’ అనేది ఉపశీర్షిక. క్రాంతి పిల్లి, సూర వేణుకుమార్, డింగారి సిద్ధార్థ్, వెంకట్, శ్రీలేఖ, ఉషాశ్రీ, సంజన, ప్రసన్న హీరో హీరోయిన్లుగా, అప్పారావు,  ఆంజనేయులు ప్రధాన పాత్రల్లో  క్రాంతి పిల్లి దర్శకత్వంలో పిల్లివారి కుటుంబం ఈ సినిమాను నిర్మిస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం చూస్తే ప్రేమలో ఎలా మోసపోకూడదో, ఏ ప్రేమ నిజమో, ఏది అబద్ధమో తెలుసుకుంటారు. ఈ చిత్రంలో మొత్తం 24 మంది సీనియర్ ఆర్టిస్టులు చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శరత్ చంద్ర.
 

Advertisement
 
Advertisement
Advertisement