లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ | Kareena Kapoor Takes a Break From London Vacation | Sakshi
Sakshi News home page

లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌

Jun 30 2019 6:33 AM | Updated on Jun 30 2019 6:33 AM

Kareena Kapoor Takes a Break From London Vacation - Sakshi

కరీనా కపూర్‌

ప్రొఫెషనల్‌ లైఫ్‌ను, పర్సనల్‌ లైఫ్‌ని భలేగా బ్యాలెన్స్‌ చేస్తున్నారు బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌. ప్రస్తుతం లండన్‌లో హాలిడే మోడ్‌లో ఉన్నారు కరీనా. తన టీవీ డ్యాన్స్‌ షో ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌’ కోసం ఒక్క రోజు ముంబై వచ్చి, షూట్‌ కంప్లీట్‌ చేసుకుని మళ్లీ లండన్‌ ఫైట్‌ ఎక్కారని బాలీవుడ్‌ సమాచారం. ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ షో’లో కరీనా జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. గత రెండు వారాలుగా ఒక్క రోజు కోసం ముంబై రావడం, లండన్‌ వెళ్లడం జరుగుతోందట. ఇక అక్షయ్‌ కుమార్‌ ‘గుడ్‌న్యూస్‌’ చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసిన కరీనా.. త్వరలో ‘అంగ్రేజీ మీడియం’ మూవీ షూటింగ్‌లో జాయిన్‌ అవుతారు. ఇంకా కరణ్‌ జోహార్‌ ‘తక్త్‌’, ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమాల్లో కరీనా హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే. ఇలా... సినిమాలు, టీవీ షోలు, హాలిడేలతో ‘మై లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ అంటున్నారు కరీనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement