పొలిటికల్‌ ఎంట్రీపై కరీనా కామెంట్‌ | Kareena Kapoor Khan Denies Joining Politics | Sakshi
Sakshi News home page

Jan 22 2019 12:14 PM | Updated on Jan 22 2019 1:28 PM

Kareena Kapoor Khan Denies Joining Politics - Sakshi

బాలీవుడ్ బ్యూటీ, పటౌడీల కోడలు కరీనా కపూర్‌ రాజకీయ అరంగేట్రంపై కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో భోపాల్‌ నుంచి కరీనాను బరిలో దించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై కరీనా స్పందించారు. తన పొలిటికల్‌ ఎంట్రీపై వస్తున్న వార్తలన్ని అవాస్తమని ప్రకటించారు.

తనను ఇంతవరకు ఏ పార్టీ సంప్రదించలేదని, ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆమె తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల మీదే ఉన్నట్టుగా వెల్లడించారు. కరీనా హీరోయిన్‌గా నటించిన ‘గుడ్‌న్యూస్‌’ సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement