వివాదంపై పెదవి విప్పిన కరణ్ జోహార్ | Karan Johar Opens Up About Ajay Devgn-KRK Controversy | Sakshi
Sakshi News home page

వివాదంపై పెదవి విప్పిన కరణ్ జోహార్

Sep 3 2016 5:24 PM | Updated on Sep 4 2017 12:09 PM

వివాదంపై పెదవి విప్పిన కరణ్ జోహార్

వివాదంపై పెదవి విప్పిన కరణ్ జోహార్

బాలీవుడ్ లో గత కొద్దిరోజులుగా అజయ్ దేవగన్, సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్(కేఆర్కే)ల మధ్య నడుస్తున్న వివాదంపై కరణ్ జోహర్ నోరు విప్పారు.

బాలీవుడ్ లో గత కొద్దిరోజులుగా అజయ్ దేవగన్, సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్(కేఆర్కే)ల మధ్య నడుస్తున్న వివాదంపై దర్శక, నిర్మాత కరణ్ జోహార్ పెదవి విప్పారు. దీపావళికి విడుదల కాబోతున్న అజయ్‌ దేవగన్‌ కొత్త సినిమాకు నెగిటివ్ గా ప్రచారం చేయడానికి  కేఆర్కేకు కరణ్ జోహార్ రూ.25లక్షలు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై ఓ ఎంటర్ టైన్ మెంట్ వెబ్ సైట్ వేసిన ప్రశ్నకు కరణ్ జవాబిచ్చారు. తన ఆత్మగౌరవం, కంపెనీ ప్రతిష్ట, తర్వాత సినిమాలు ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదని అన్నారు. కరణ్ నిర్మిస్తున్న అయే దిల్ హై ముష్కిల్ తో పోటీ పడుతుందన్న కారణంతోనే శివాయ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై విచారణ జరపాలని అజయ్ దేవగన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక వచ్చేనెల 28న ‘శివాయ్‌’తో పాటుగా కరణ్‌ జోహార్‌ మూవీ ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ రిలీజవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement